వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడెల విషయంలో చంద్రబాబు మౌనానికి కారణం ఇదేనా ?

|
Google Oneindia TeluguNews

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విషయంలో చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారు? కోడెల విషయంలో అసలు జరుగుతుంది ఏంటి ? ఒకపక్క అధికార పార్టీ, మరోపక్క సొంత పార్టీ కోడెల ను టార్గెట్ చేసుకుని ఎందుకు దాడి చేస్తుంది? ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కోడెల విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం పార్టీ పైన తీవ్రంగా ఉంటుందా? ఇవి ఏపీలో కోడెల వ్యవహారంలో హాట్ టాపిక్ గా మారిన అంశాలు.

అధికార పార్టీకి టార్గెట్ గా మాజీ స్పీకర్ కోడెల .. కే టాక్స్ వసూళ్ళంటూ కేసులు

అధికార పార్టీకి టార్గెట్ గా మాజీ స్పీకర్ కోడెల .. కే టాక్స్ వసూళ్ళంటూ కేసులు

కోడెల శివప్రసాద్... మాజీ స్పీకర్ .. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి అంబటి రాంబాబు చేతిలో పరాజయం పాలయ్యారు. స్పీకర్ గా పనిచేసిన సమయంలో వైసిపి వైఖరిపై అనేకమార్లు స్పీకర్ హోదాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు గత అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలే ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న టాక్ వైసిపి వర్గాల్లో ఉంది. ఇక అధికారం చేజిక్కించుకున్న వైసిపి కోడెల ను టార్గెట్ చేసింది అన్న భావన రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కోడెల శివప్రసాద్ కొడుకు, కూతురుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కే టాక్స్ వసూలు చేశారంటూ , భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ కోడెల కుమార్తె విజయ లక్ష్మి, కోడెల కుమారుడు శివరాం లపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంతే కాదు తాజాగా కోడెల కుమారుడు శివరాం నిర్వహిస్తున్న హోండా షో రూమ్ ను అధికారులు సీజ్ చేశారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెలపై రాయపాటి వర్గం అసమ్మతి సెగ

సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెలపై రాయపాటి వర్గం అసమ్మతి సెగ

దీంతో కోడెల వైసిపి తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తన కుమారుడు, కుమార్తెపై తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపణలు గుప్పించారు. ఇక కోడెల కే టాక్స్ వసూళ్లపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తుంటే, సొంత పార్టీలోనూ ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బయటకు వచ్చింది.
రాయపాటి సాంబశివ రావు కుమారుడు రాయపాటి రంగబాబు కోడెల టార్గెట్ గా అసమ్మతి వర్గం నేతలతో కలిసి సత్తెనపల్లి నియోజకవర్గం లో హల్చల్ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనే తనకు టిక్కెట్ ఇవ్వాలంటూ రాయపాటి రంగబాబు అధినేత చంద్రబాబును కోరారు. ఇక రాయపాటి సాంబశివరావు తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుండి కోడెల పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఒక సీనియర్ గా ఆయనకు ప్రాధాన్యతనిచ్చి టికెట్ ఇచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం కోడెలకు ప్రతికూలంగా వచ్చాయి.

పార్టీలో కోడెల విషయంలో అసమ్మతిపై చంద్రబాబు మౌనం

పార్టీలో కోడెల విషయంలో అసమ్మతిపై చంద్రబాబు మౌనం

ఇక ఈ మధ్య జరుగుతున్న గొడవ తో కోడెల చంద్రబాబుకు నియోజకవర్గ పరిస్థితిని, తన కుటుంబంపై కావాలని పెట్టిన కేసులను గురించి చంద్రబాబుకు చెప్పుకున్నారు. ఇక ఇదే సమయంలో కోడెల వద్దు అంటూ రాయపాటి వర్గం నిరసన తెలియజేశారు.
కానీ చంద్రబాబు ఒకపక్క కోడెల కుటుంబంపై పెడుతున్న కేసులు, మరోపక్క కోడెలపై పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న దాడి విషయంలో మౌనంగా ఉన్నారు. కోడెల వ్యవహారంలో ఎలాంటి చర్య తీసుకున్నా అది పార్టీకి నష్టం చేస్తుందన్న భావన చంద్రబాబులో ఉంది. ఒకవేళ కోడెల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే , రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా అసమ్మతి పలు నియోజకవర్గాల్లో నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు.

చర్య తీసుకుంటే ఓ తంటా .. తీసుకోకుంటే మరో తంటా ... చంద్రబాబుకి తలనొప్పిగా కోడెల వ్యవహారం

చర్య తీసుకుంటే ఓ తంటా .. తీసుకోకుంటే మరో తంటా ... చంద్రబాబుకి తలనొప్పిగా కోడెల వ్యవహారం

కోడెల విషయంలో పెట్టిన కేసులలో కూడా ఎక్కువమంది టీడీపీకి చెందిన వారు పెట్టిన కేసులు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఎలాగైనా కోడెల ను తప్పించాలనే లక్ష్యంగా వ్యతిరేక వర్గం పనిచేస్తోంది. చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన కోడెల వ్యతిరేక వర్గం ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. కానీ చంద్రబాబు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకునే ఆలోచనలో లేరు. ఒకవేళ కోడెల శివప్రసాద్ పై చర్య తీసుకుంటే , కోడెల తప్పు చేసింది ఒప్పుకున్నట్టు అవుతుందని ఒక భావన ఉంది. చర్య తీసుకోకపోతే పార్టీలో అసమ్మతి ఏ రూపు తీసుకుంటుందో అన్న అనుమానం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబుకు కోడెల వ్యవహారం ప్రస్తుతం పెద్ద తలనొప్పిగా తయారైంది. కోడెల కుటుంబం పై పెట్టిన కేసుల కంటే పార్టీలోని అంతర్గత పోరు విషయంలో చంద్రబాబు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని సమాచారం.

English summary
TDP chief chandrababu is silent on kodela issue .. Cases against the Kodela family, on the other hand, the party's internal attack on the Kodela in sattenappali irritates chandrababu . Chandrababu has the feeling that whatever action is taken in the affairs of Kodela is damaging to the party. If any decision is made in respect of kodela , similar disagreements across the state are likely to occur in many constituencies. So Chandrababu is waiting for the trend change .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X