ఫేక్ సీఎం జగన్.. రామతీర్ధం ఘటన జరిగి ఐదు రోజులైనా ఏం గడ్డి పీకారు : చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. రామతీర్థం ఘటన అమానుషమని మండిపడిన చంద్రబాబు ఘటన జరిగి ఐదు రోజులైనా పట్టించుకోకుండా ఏం గడ్డి పీకాడని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రామతీర్థం పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అడుగడుగునా అడ్డు తగిలారని మండిపడిన చంద్రబాబు రామతీర్థం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం తనపై నిందలు వేస్తోందని నిప్పులు చెరిగారు.
పేకాడితే ఉరేస్తారా ? చంద్రబాబు, ఉమలా వ్యభిచార గృహాలు నడపలేదు : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

గ్రామాల్లో విచ్చలవిడిగా పెరిగిపోతున్న చర్చిలపై హిందువులు ఆలోచన చెయ్యాలన్న చంద్రబాబు
జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డ చంద్రబాబు జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని ,జగన్ ఒక పిచ్చోడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు . కరోనా పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్య అందరినీ ఇబ్బంది పెట్టిందని అభిప్రాయపడిన చంద్రబాబు గాలి కబుర్లు , గాలి మాటలు చెబుతూ, గాలిలో తిరిగే ఫేక్ ముఖ్యమంత్రి జగన్ అంటూ మండిపడ్డారు. మన దేవాలయాలు మనమే కాపాడుకోవాలి అని పిలుపునిచ్చిన చంద్రబాబు గ్రామాల్లో విచ్చలవిడిగా పెరిగిపోతున్న చర్చిలపై హిందువులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
యువ హీరోయిన్ షీలా రాజ్‌కుమార్ హోమ్లీ ఫోటో గ్యాలరీ

రాష్ట్రంలో మత మార్పిడి చేయడానికి వీలు లేదన్న చంద్రబాబు
రాష్ట్రంలో మత మార్పిడి చేయడానికి వీలు లేదని చంద్రబాబు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా పనిచేస్తానాని ప్రమాణం చేసిన జగన్ ఆ విషయాన్ని గుర్తించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు . చంద్రబాబు హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఆలయాలపై కొనసాగుతున్న దాడులు, విగ్రహ విధ్వంసం ఘటనలపై టిడిపి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుంది అంటూ పేర్కొన్నారు.
తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.

క్రిస్టియన్లు అయినంత మాత్రాన ఆలయాల పై జరుగుతున్న దాడులను ఆపరా ?
పాస్టర్లకు నెల నెలా 5,000 రూపాయలు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్న చంద్రబాబు సీఎం హోంమంత్రి డిజిపి అందరూ క్రిస్టియన్లు అవడంతో దేవాలయాలపై దాడులు జరుగుతున్న ఆపడం లేదంటూ మండిపడ్డారు. క్రిస్టియన్లు అయినంత మాత్రాన ఆలయాల పై జరుగుతున్న దాడులను ఆపరా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. తాము రామతీర్థం పర్యటన చేపట్టడంతో భయపడి తప్పించుకోవడం కోసమే తనపై నిందలు వేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మసీదుల పైన చర్చిల పైన దాడి జరగలేదు
తనకు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్న చంద్రబాబు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మసీదుల పైన చర్చిల పైన దాడి జరగలేదని మత మార్పిడి చేయించే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని మండిపడ్డారు . హిందూ ముస్లింల మనోభావాలను దెబ్బ తీసే అధికారం ఎవరిచ్చారు అంటూ నిప్పులు చెరిగారు. హిందువులతో పాటు ముస్లింల పైన కూడా దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇదే సమయంలో భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ పై విమర్శలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్న చంద్రబాబు, ప్రజల్లో చైతన్యం రావడం వల్లనే కరోనా ను కట్టడి చేయగలిగాము అని పేర్కొన్నారు.