ఇక్కడ వరద బాధితుల ఆర్తనాదాలు.. అక్కడ అసెంబ్లీలో జగన్ కు పొగడ్తలు; భగ్గుమన్న చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ జిల్లాలలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు వరద బాధితులను పరామర్శిస్తున్న వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనూ, చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు తన పర్యటనను కొనసాగిస్తున్నారు.

జగన్ సర్కార్ నిర్లక్ష్యం ప్రజలకు శాపం
రాష్ట్రంలో వరద పరిస్థితులపై, వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితుల స్థితిగతులపై మాట్లాడిన చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం అడుగడుగున కనిపించిందని చంద్రబాబు జగన్ సర్కార్ పై మండిపడ్డారు. వరదల విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావని పేర్కొన్న చంద్రబాబు అలాంటి సమయంలోనే సమర్థంగా పని చేయాలని పేర్కొన్నారు. సమర్థవంతంగా వ్యవహరించి ఉంటే ప్రాణనష్టం తగ్గి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

బాధ్యతను గాలికొదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు
రెండు రోజులుగా కడప, తిరుపతి ప్రాంతాల్లో పర్యటించానని పేర్కొన్న చంద్రబాబు చెన్నై వర్షాల ప్రభావం కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలపై పడిందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని వారి అనుభవరాహిత్యం ప్రజలకు శాపంగా మారిందని చంద్రబాబు ఆక్షేపించారు. పించా, అన్నమయ్య డ్యామ్ లలో నీరు వచ్చే సమయంలో అప్రమత్తం చేయలేకపోయారని, ఇలాంటి విపత్తు పొంచి ఉన్న సమయాల్లో బలవంతంగానైనా ప్రజలను ఖాళీ చేయించాల్సి ఉంటుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ శాఖ ప్రాథమిక బాధ్యత ఇది అని పేర్కొన్న చంద్రబాబు చేయాల్సిన పని చేయకుండా ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.

ప్రభుత్వం ఎక్కడుంది? అధికార యంత్రాంగం కుప్ప కూలింది
పించా,
అన్నమయ్య
ప్రాజెక్టులో
నాసిరకమైన
పనులు
చేశారని,
అన్నమయ్య
ప్రాజెక్టు
నిర్వహణకు
నిధులు
ఇవ్వలేదని,
అందుకే
ఇప్పుడు
గేట్లు
తెరుచుకోలేదు
అనే
వార్తలు
కూడా
వచ్చాయని
చంద్రబాబు
పేర్కొన్నారు.
వాటర్
మేనేజ్మెంట్
లో
ప్రభుత్వం
విఫలమైందని
పేర్కొన్న
చంద్రబాబు
రాయలచెరువు
పరిస్థితిపై
కూడా
సీరియస్
గా
ప్రభుత్వం
తీసుకోలేదన్నారు.
రాయల
చెరువు
పరిస్థితిపై
సీనియర్
అధికారులు
ముందుకు
వచ్చి
భరోసా
ఇవ్వలేకపోయారని
చంద్రబాబు
పేర్కొన్నారు
.
అసలు
ప్రభుత్వం
ఎక్కడుందని
ప్రశ్నించారు
చంద్రబాబు.
అధికార
యంత్రాంగం
మొత్తం
కుప్పకూలిపోయిందని
ప్రకృతితో
ఆడుకున్నారని
విమర్శించారు.
అసెంబ్లీలో పొగడ్తలతో జగన్ ఆనందం.. ఇది కచ్చితంగా మానవ తప్పిదమే
ఇలాంటి పరిస్థితుల్లో కూడా సీఎం అసెంబ్లీలో ఆనందపడుతూ పొగిడించుకుంటున్నారని, ఇక్కడ ప్రజల ఆర్తనాదాలు అక్కడ పొగడ్తలు అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. వరద బాధితులు కుటుంబ సభ్యులను కోల్పోవడంతో పాటుగా తిండి లేక నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వరదలు మానవ తప్పిదమే అని పేర్కొన్న చంద్రబాబు దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలని అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో ఎందుకు నీటిని విడుదల చేయలేదు? ప్రాజెక్టులు ఎందుకు సరిగా నిర్వహించలేక పోయారు? తుమ్మలగుంట లో క్రికెట్ స్టేడియం పెట్టడం వల్ల నీళ్లు జనావాసాల్లోకి వచ్చేసింది దీనికి బాధ్యులెవరు? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు చంద్రబాబు.

అధికారం ఇచ్చిన వారే పాతాళానికి తొక్కేస్తారు
అధికారం ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తే అధికారం ఇచ్చిన వారే పాతాళానికి తొక్కేస్తారని చంద్రబాబు మండిపడ్డారు. వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం అడుగడుగున విఫలమైందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడా క్యాంపులు నిర్వహించలేదని పునరావాసంలోను విఫలమయ్యారని పేర్కొన్న చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సుమారు 40వేల మందికి సహాయం అందించామని పేర్కొన్నారు. వరద కారణాలపై న్యాయ విచారణ చేపట్టి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.