వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై వ్యూహం, జగన్‌కు నో ఛాన్స్, బాబు లెక్క ఇదీ!: టీడీపీకి విన్-విన్ సిచ్యుయేషన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రత్యేక హోదా అంశం తిరిగి రాజుకున్నప్పటికీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విన్ - విన్ పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమా? అంటే అవునని అంటున్నారు.

చదవండి: జగన్ కంపెనీల్లోకి రూ.70 కోట్లు: ఇందూ కేసు.. జగన్-విజయసాయిలకు సీబీఐ షాక్

ఇటీవలే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2019లో తిరిగి కేంద్రంలో మోడీయే వస్తారని, ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జాతీయస్థాయిలో బీజేపీకి కొన్ని సీట్లు తగ్గితే తగ్గవచ్చు. కానీ మోడీ ప్రధాని కావడం ఖాయమని చాలామంది భావిస్తున్నారు.

చదవండి: బాబుకు 'ఆదినారాయణరెడ్డి' దెబ్బ, షాకైన జగన్‌లో కొత్త హుషారు: టీడీపీ ఆందోళన

మళ్లీ మోడీయే.. చంద్రబాబుది, జగన్‌దీ ఒకే ఆలోచన

మళ్లీ మోడీయే.. చంద్రబాబుది, జగన్‌దీ ఒకే ఆలోచన

ఇదే విషయం గ్రహించిన చంద్రబాబు బీజేపీతో పొత్తు విషయంలో తెగించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్‌కు కూడా అదే ఆలోచన ఉందని, 2019లో సీట్లు తగ్గినా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారని, అందుకే ఆ పార్టీకి దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన ప్రయత్నాలకు బాబు చెక్ చెబుతున్నారని అంటున్నారు.

ఇక్కడ పవన్‌తో జత కలిసినా గెలవొచ్చు కానీ

ఇక్కడ పవన్‌తో జత కలిసినా గెలవొచ్చు కానీ

2019లో ఏపీలో బీజేపీ పొత్తు లేకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మచ్చిక చేసుకొని ముందుకు వెళ్తే చంద్రబాబు మరోసారి గెలుస్తారని, కానీ ఆ తర్వాత కేంద్రం అవసరం ఉంటుందని, అందుకే చంద్రబాబు బీజేపీ విషయంలో తెగించే ప్రయత్నం చేయడం లేదేమోననే వాదనలు వినిపిస్తున్నాయి.

పవన్‌తో కలిసి పని చేస్తానో లేదో, రాజకీయం అర్థం తెలియదు, నేనే రాజకీయాలు చేస్తున్నా: జేపీపవన్‌తో కలిసి పని చేస్తానో లేదో, రాజకీయం అర్థం తెలియదు, నేనే రాజకీయాలు చేస్తున్నా: జేపీ

బాబు మనసులో.. కర్ర విరగకుండా, పాము చావకుండా

బాబు మనసులో.. కర్ర విరగకుండా, పాము చావకుండా

మంత్రి ఆదినారాయణ రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడంతోనే చంద్రబాబు మనసులో ఏమున్నదో దాదాపు తెలిసిందని అంటున్నారు. బీజేపీతో తెంచుకుంటే ఏపీకి నష్టమనే అభిప్రాయం ఆయనలో కనిపిస్తోందని అంటున్నారు. అందుకే కర్ర విరగకుండా, పాము చావకుండా చంద్రబాబు ముందుకెళ్తున్నారని అంటున్నారు.

అప్పటి దాకా అదే ఆలోచన

అప్పటి దాకా అదే ఆలోచన

ఓ వైపు ఏపీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలు మెచ్చేలా కేంద్రంపై పోరాటం చేస్తూనే, అదే సమయంలో బీజేపీతో పొత్తు చెడిపోకుండా ముందుకు సాగాలని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. అందుకే చివరి నిమిషం వరకు నిధుల విషయంలో ఒత్తిడి తెచ్చే ఆలోచనతోనే ఉన్నారని, అప్పటికీ న్యాయం జరగకుంటే ఏదైనా ఆలోచన చేస్తారని అంటున్నారు.

మోడీ నటిస్తే కనుక, కేవలం మంత్రమే: పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్‌కు జేపీ షాక్మోడీ నటిస్తే కనుక, కేవలం మంత్రమే: పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్‌కు జేపీ షాక్

ఇలా విన్ విన్ సిచ్యుయేషన్

ఇలా విన్ విన్ సిచ్యుయేషన్

బీజేపీ విషయంలో చంద్రబాబు మిత్రపక్షంగా ఉంటేనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. నిధులు సాధిస్తే మా పోరాట ఫలితమని, లేదంటే ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రజల్లోకి వెళ్లే అవకాశం టీడీపీకి ఉందని అంటున్నారు. పైగా బీజేపీని వదిలేస్తే లెఫ్ట్ పార్టీలు టీడీపీతో కలిసే అవకాశాలు కొట్టిపారేయలేం. టీడీపీ హోదా గళం ఎత్తుకుంటే పవన్ కూడా జత కలుస్తారు. ఏ రకంగా చూసినా 2019లో చంద్రబాబుకు విన్-విన్ సిచ్యుయేషన్ ఉందని అంటున్నారు.

వైసీపీ ప్రశ్నలకు టీడీపీ వద్ద సమాధానాలు

వైసీపీ ప్రశ్నలకు టీడీపీ వద్ద సమాధానాలు

ప్రత్యేక హోదా లేదా బీజేపీతో తెగదెంపులపై వైసీపీ ప్రశ్నించినా టీడీపీకి సమాధానాలు ఉన్నాయని చెబుతున్నారు. హోదాకు తగిన ప్యాకేజీ ఇస్తామని చెప్పారని, అందుకే ఆగామని, మరి హోదా కోసం రెండేళ్ల క్రితం రాజీనామా చేస్తామని చెప్పిన వైసీపీ ఎందుకు తగ్గిందని, ఇప్పుడు ఫలితం లేని రాజీనామాలు ఎందుకు ప్రకటిస్తోందని ప్రశ్నించే అవకాశముందంటున్నారు.

ఏపీకి సహకరిస్తాం: హైదరాబాదుకు ఏపీ మంత్రి అఖిలప్రియకు ఆహ్వానంఏపీకి సహకరిస్తాం: హైదరాబాదుకు ఏపీ మంత్రి అఖిలప్రియకు ఆహ్వానం

English summary
Chandrababu Naidu's latest tirade over BJP is a strategic masterstroke to convert a threat into an opportunity. This is precisely what he did in 2014. Even after supporting the bifurcation of the state, Naidu ran a propaganda blitz calling bifurcation a blunder and reaped a huge political dividend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X