వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబుతో ఆ అడుగు వేయించింది బీజేపీనే..! చాలా కాలం త‌ర్వాత కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న బాబు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: అణ‌చివేత ప‌రాకాష్ట‌కు చేరిన చోట విప్ల‌వం ఉద‌యిస్తుందంటారు. క‌క్ష్య సాదింపు చ‌ర్య‌లు మితిమీ2రిన‌ప్పుడు కొత్త ఆలోచ‌లు ఉద్బ‌విస్తాయంటారు. ప్ర‌స్తుతం ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఇలాంటి ప‌రిణామాలే చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ విధాల‌నాకు విసిగిపోయిన చంద్ర‌బాబు, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కాకుండా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు క‌ట్టుబ‌డి ఏళ్ల‌త‌ర‌బ‌డిగా కొన‌సాగుతున్న శ‌త్రుత్వాన్ని స్నేహంగా మార్చుకున్నారు. కొన్ని పొందాలంటే మ‌రికొన్ని ఒదులుకోవాల‌నే సిద్దాంతానికి క‌ట్టుబ‌డి కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ప్ర‌యాణించేందుకు కొత్త అడుగులు వేసారు. చంద్ర‌బాబు తీసుకున్న అనూహ్య నిర్ణ‌యం వెన‌క ఉన్న అస‌లు ర‌హ‌స్యం ఏంటి..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శ‌త్రువులు ఉండ‌ర‌ని నిరూపించిన కాంగ్రెస్ - టీడిపి..!!

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శ‌త్రువులు ఉండ‌ర‌ని నిరూపించిన కాంగ్రెస్ - టీడిపి..!!

గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. బీజేపీ, ఆంధ్రప్రదేశ్ ప‌ట్ల అనుస‌రిస్తున్న విధానాల ప‌ట్ల తిరగబడిన టీడీపీ, ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ పార్టీపై ప్ర‌శ్చ‌న్న యుద్దం కొన‌సాగిస్తూనే ఉంది టీడిపి. గత పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు ఆ పార్టీ ఎంపీలు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి రావాల్సిన నిధులను ఆపేయడంతో పాటు, టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయించడం మొద‌లుపెట్టింది ఎన్డీయే ప్ర‌భుత్వం.

Recommended Video

Telangana Elections 2018 : రాహుల్ ఇంటికి చంద్రబాబు
బీజెపి ప‌రాకాష్ట విధానాలు..! చంద్ర‌బాబు ప్ర‌తీకార చ‌ర్య‌లు..!!

బీజెపి ప‌రాకాష్ట విధానాలు..! చంద్ర‌బాబు ప్ర‌తీకార చ‌ర్య‌లు..!!

దీంతో ప్రతిపక్షాలతో లోపాయికార ఒప్పందాలు కుదుర్చుకున్న మోదీ స‌ర్కార్ క‌క్ష్య సాదింపు చ‌ర్య‌ల‌కు పూనుకుంటోందని చంద్రబాబు స్టేట్‌మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రంపై ఎదురుదాడికి దిగారు చంద్ర‌బాబు. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని సీఎం నిర్ణయించుకున్నారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారితో కలిసి వెళ్లేందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు పావులు క‌దుపుతున్నారు.

సుధీర్గ‌కాలం త‌ర్వాత జాతీయ నేత‌ల‌తో బాబు మంత‌నాలు..! బీజేపి ప‌త‌న‌మే టార్గెట్..!!

సుధీర్గ‌కాలం త‌ర్వాత జాతీయ నేత‌ల‌తో బాబు మంత‌నాలు..! బీజేపి ప‌త‌న‌మే టార్గెట్..!!

తాజాగా గురువారం ఢిల్లీ వెళ్లి పలువురు ప్రముఖులతో చర్చలు జరిపారు చంద్రబాబు. మొదట శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలతో భేటీ అయిన ఆయన తర్వాత కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. వీరి మధ్య రాఫెల్ ఒప్పందం, సీబీఐలో కలకలం, సహా పలు జాతీయ, ప్రాంతీయ వ్యవహారాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు చంద్రబాబు ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడితో భేటీ కావ‌డం రెండు ద‌శాబ్దాల తర్వాత మ‌ళ్లీ ఇదే తొలిసారి.

బాబును ఉసిగొల్పింది బీజేపినే..! ఎలాంటి మార్పులైనా చోటుచేసుకోవ‌చ్చు..!!

బాబును ఉసిగొల్పింది బీజేపినే..! ఎలాంటి మార్పులైనా చోటుచేసుకోవ‌చ్చు..!!

1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. అంటే 20 ఏళ్ల తర్వాత ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఆ కలయిక తర్వాత ఈ రెండు పార్టీల మధ్య అసలు ఏ విధమైన చర్చలు జరగలేదు. తాజాగా చంద్రబాబు-రాహుల్ కల‌యిక ప‌రిణామాల వెన‌క అనూహ్య కారాణాలు క‌నిపిస్తున్నాయి. కాగా చంద్ర‌బాబు కాంగ్రెస్ తో స్న‌హం చేయ‌డానికి ప్రేర‌ణ ఇచ్చింది మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీ అని చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
TDP and BJP working together in the last election resulted in a disaster. The TDP, which revolved around the policies adopted by the BJP and the Andhra Pradesh, came out of the NDA. Since then, the battle against the party has been continuing with the NDA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X