వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ లండన్ టూర్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు....లండన్‌కు ఎందుకు వెళ్లారంటే..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Jagan London Visit To Bring Hawala Money, Says Chandrababu | Oneindia Telugu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ లండన్ టూర్ వెనక పెద్ద రహస్యమే దాగి ఉందని అన్నారు చంద్రబాబు. కేవలం హవాలా డబ్బుల కోసమే జగన్ విదేశీ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్‌కు వెళ్లారని అన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని లాజిక్ చెప్పారు చంద్రబాబు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార పక్షం ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు ఎంపీలు వైసీపీ కండువా కప్పుకోవడంతో ఈ హీట్ మరింత పెరిగింది. టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీలు పసుపు పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో అంటే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతోంది టీడీపీ. ఎంపీల పనితీరు బాగోలేకపోవడంతో వారికి ఈసారి టికెట్ కేటాయించడం లేదన్న సంగతి అర్థమై వారు వైసీపీకి వెళ్లి టీడీపీపై విమర్శులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Chandrababu takes a dig at Jagans London tour, says its for Hawala money

ఇక టీడీపీ నుంచి కొందరు ప్రజాప్రతినిధులు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత వైయస్ జగన్ లండన్‌లో చదువుకుంటున్న తన కూతరును చూసేందుకు అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ లండన్ టూర్ పరమార్థం వేరని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా గురించి జగన్ బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు సూటి ప్రశ్న వేశారు. ఇదిలా ఉంటే మరో మంత్రి దేవినేని ఉమా కూడా జగన్ పర్యటనపై ఆరోపణలు చేశారు. అసలు జగన్ లండన్‌లో రాజకీయాలు నడుపుతున్నారని ఆరోపించారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి కూడా తమ కూతురును చూసేందుకు లండన్ వెళ్లారు.

English summary
AP CM Chandra babu naidu turned guns at the Opposition leader YS Jagan Reddy's London tour. Naidu accused Reddy that his tour was for his political benifits. " Jagan Reddy had gone to London to collect the hawala money" said Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X