అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్మాబాద్ కోర్టుకు వెళ్లాలా? వద్దా?: చంద్రబాబు కీలక చర్చ, చివరకు ‘రీకాల్’కే ఓటు!

|
Google Oneindia TeluguNews

అమరావతి: బాబ్లీ కేసు విషయంలో నోటీసులు రావడంతో ధర్మాబాద్ కోర్టుకు స్వయంగా హాజరు కావాలా? వద్దా అనేదానిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో కీలక చర్చలు నిర్వహించారు. అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులు, ముఖ్యనేతలు, అడ్వకేట్‌ జనరల్‌తో తన నివాస ప్రాంగణంలోని ప్రజా వేదికలో సమావేశమయ్యారు.

<strong>వైసీపీ ఎంపీల రాజీనామా: ఆ ఐదు లోక్‌సభ స్థానాల ఉపఎన్నికలపై తేల్చేసిన ఈసీ</strong>వైసీపీ ఎంపీల రాజీనామా: ఆ ఐదు లోక్‌సభ స్థానాల ఉపఎన్నికలపై తేల్చేసిన ఈసీ

కోర్టుకు హాజరు కావాలా? వద్దా?

కోర్టుకు హాజరు కావాలా? వద్దా?

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ దాడులు, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల తదితర అంశాలపైనా చర్చించారు. ముఖ్యంగా బాబ్లీ పోరాటంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పై హాజరు కావాలా? వద్దా? అనే అంశంపైనే ఈ భేటీలో కీలక చర్చ జరిగింది.

భారీ ర్యాలీగా వెళితే...

భారీ ర్యాలీగా వెళితే...

ధర్మబాద్ కోర్టుకు భారీ ర్యాలీతో హజరైతే బాగుంటుందని చంద్రబాబుకి ఇప్పటికే కొందరు మంత్రులు సూచించారు. అయితే, కోర్టుకు వెళ్లకుండా రీకాల్‌ పిటిషన్‌ వేయాలని మరికొందరు మంత్రులు కోరారు. చిన్న కేసులకు సీఎం స్థాయి వ్యక్తి ఎందుకు హాజరుకావాలని సీనియర్‌ మంత్రులు అభిప్రాయపడ్డారు.

రీకాల్ పిటిషన్‌కే బాబు మొగ్గు

రీకాల్ పిటిషన్‌కే బాబు మొగ్గు

ఈ సమావేశంలో అందరి సూచనలు పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు.. కోర్టుకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. రీకాల్‌ పిటిషన్‌ వేసేందుకే ఆయన మొగ్గు చూపినట్లు తెలిసింది. సీఎంతో సమావేశమైన వారిలో మంత్రులు కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, నారాయణ, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, అమర్నాథ్ రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులున్నారు.

సీఎం అయినా రావాల్సిందేనన్న కోర్టు

సీఎం అయినా రావాల్సిందేనన్న కోర్టు

కాగా, బాబ్లీ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు సహా 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ నెలలో చంద్రబాబు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ హాజరై కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో సీఎం అయినా, మరెవరైనా కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Saturday takes Leaders Opinion on Dharmabad Court Notice issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X