విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీపై కుట్రలు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఢిల్లీలో కేంద్రంపై చంద్రబాబు ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు.

<strong>జగన్‌పై దాడి జరిగితే.. మమ్మల్ని ఏ1, ఏ2లంటారా?: చంద్రబాబు ఆగ్రహం, 'తక్కువ అంచనావేయొద్దు'</strong>జగన్‌పై దాడి జరిగితే.. మమ్మల్ని ఏ1, ఏ2లంటారా?: చంద్రబాబు ఆగ్రహం, 'తక్కువ అంచనావేయొద్దు'

ఏపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు

ఏపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు

ఏపీలో ప్రభుత్వాన్ని పడొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఏపీ రాజకీయాలను అందరూ గమనిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండాలన్నారు.

వ్యవస్థల దుర్వినియోగం

వ్యవస్థల దుర్వినియోగం

‘మోడీ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చెప్పిన హామీలేవీ మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదు. విదేశాల్లో నల్లధనం తీసుకొస్తామన్న హామీ ఏమైంది? కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగిం చేస్తోంది' అని చంద్రబాబు దుయ్యబట్టారు.

హామీలు నెరవేర్చలేదు.. అమలులో విఫలం

హామీలు నెరవేర్చలేదు.. అమలులో విఫలం

దేశంలో వృద్ధిరేటు పెద్దగా ఏమీ లేదని అన్నారు. వ్యవసాయ వృద్ధి లేదని, రైతులు ఎంతో అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలు దేశం నుంచి విడిపోయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఏమైందని ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని చంద్రబాబు చెప్పారు. సరైన ప్రణాళికతో అమలు చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. జీఎస్టీ అమల్లోకి తెచ్చినా ప్రయోజనం లేదని అన్నారు. దేశంలో బ్యాంకులన్నీ స్థైర్యం కోల్పోయాయన్నారు.

ఐటీ దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తోంది..

ఐటీ దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తోంది..

కేంద్రం ఏపీ ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి కుట్రలు చేస్తోందన్నారు. ఏపీలో ఐటీదాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

తొలిసారి ప్రాంతీయ ప్రార్టీ అవిశ్వాసం పెట్టింది

తొలిసారి ప్రాంతీయ ప్రార్టీ అవిశ్వాసం పెట్టింది

ఏపీలో పునర్విభజన హామీలు నెరవేర్చలేని చంద్రబాబు ఆరోపించారు. తొలిసారి ఓ ప్రాంతీయ పార్టీ ఇతర పార్టీల మద్దతుతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిందని చంద్రబాబు తెలిపారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu takes on at Centre in delhi on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X