విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భయపడే వ్యక్తిని కాను, శివాజీ చెప్పినట్లే...: తెలంగాణలో ప్రచారంపై చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

<strong>కేసీఆర్‌కే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా?: మోడీపై చంద్రబాబు నిప్పులు</strong>కేసీఆర్‌కే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా?: మోడీపై చంద్రబాబు నిప్పులు

శివాజీ అనే వ్యక్తి చెప్పినట్లు ఆపరేషన్ గరుడ.. రేవంత్ సహా..

శివాజీ అనే వ్యక్తి చెప్పినట్లు ఆపరేషన్ గరుడ.. రేవంత్ సహా..

‘శివాజీ అనే వ్యక్తి ఆపరేషన్ గరుడ అనే విషయాన్ని చెప్పారు. ఆయన చెప్పినట్లు ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో, విపక్ష నేతలపై కేంద్రం ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డితోపాటు ఏపీలో 19బృందాలు ఐటీ దాడులు చేశాయి. సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇతర టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి' అని చంద్రబాబు తెలిపారు.

ఏపీని ఇబ్బందులకు గురిచేస్తోంది..

ఏపీని ఇబ్బందులకు గురిచేస్తోంది..

దాడులు, ఐటీ దాడులతో ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధి సాధిస్తున్నామని, ఐనా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

 చంద్రబాబు భయపడరు..

చంద్రబాబు భయపడరు..

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, వ్యవస్థల దుర్వినియోగం జరుగుతోందని కేంద్రంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత తమ పార్టీ నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి దాడులకు భయపడమని చంద్రబాబు చెప్పారు. దేశాన్ని రెండంకెల వృద్ధిరేటుతో నడిపించాల్సి ఉండగా. అలా జరగడం లేదని అన్నారు.

<strong>ఏపీపై కుట్రలు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఢిల్లీలో కేంద్రంపై చంద్రబాబు ఫైర్</strong>ఏపీపై కుట్రలు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఢిల్లీలో కేంద్రంపై చంద్రబాబు ఫైర్

సంకీర్ణాలే మేలు.. తెలంగాణలో మా పార్టీ నేతలే..

సంకీర్ణాలే మేలు.. తెలంగాణలో మా పార్టీ నేతలే..

తాము బీజేపీని ఎదుర్కొనేందుకే ఇతర పార్టీలతో కలుస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐతో కలిసి టీడీపీ మహాకూటమిగా ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ నేతలే ప్రచారం చేస్తారని తెలిపారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలే మంచి పాలన అందించగలవని చంద్రబాబు తెలిపారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu takes on at IT attacks issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X