విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ‘కోడికత్తి’పై అతి వద్దు: సొంత పార్టీ నేతలకు చంద్రబాబు, ‘కోతిపుండులా సాగదీస్తారా?’

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా స్పందించారు. జగన్ ఉచ్చులో పడొద్దని టీడీపీ నేతలకు సూచించారు.

జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు?: మూడు నెలలుగా విశాఖ నుంచే, ఐనా ఎన్నడూ కలవని శ్రీనివాస్.! జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు?: మూడు నెలలుగా విశాఖ నుంచే, ఐనా ఎన్నడూ కలవని శ్రీనివాస్.!

 కోడి కత్తి ఘటనపై అంత తీవ్రంగా అవసరం లేదు

కోడి కత్తి ఘటనపై అంత తీవ్రంగా అవసరం లేదు

కడప జిల్లా పర్యటనకు వెళ్లే ముందు పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. కోడికత్తి ఘటనపై అంత తీవ్రంగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని సూచించారు. టీడీపీ నేతల తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ మేరకు సూచించినట్లు తెలుస్తోంది. టిట్లీ తుఫాను బాధితులకు త్వరలోనే చెక్కులు పంపిణీ చేయనున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

 కోడికత్త ఘటనను కోతిపుండులా..

కోడికత్త ఘటనను కోతిపుండులా..

అక్టోబర్ 25 నుంచి ఏపీలో కోడికత్తి వ్యవహారాన్ని కోతిపుండులా సాగదీస్తున్నారని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి చేసింది వాస్తవమే అని, అయితే ఎందుకు దాడికి పాల్పడ్డాడు. ఎవరెవరి పాత్ర ఉందనే అనే కోణంలో విచారణ సాగాలన్నారు. ఏపీ దర్యాప్తు సంస్థకు సహకరించకుండా.. ఏపీ పోలీసులపై జగన్ నమ్మకం లేదనడం విడ్డూరంగా ఉందని తులసిరెడ్డి అన్నారు.

Recommended Video

జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు? | Why Srinivas Rao Did That Attempt Ys Jagan on that day only?
బీజేపీ ఎందుకంత స్పందిస్తుంది..

బీజేపీ ఎందుకంత స్పందిస్తుంది..

సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో బీజేపీ నేతలు అతిగా స్పందించారని తులసిరెడ్డి మండిపడ్డారు. హోదా, విభజనపై స్పందించని బీజేపీ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఓ బీజేపీ ఎంపీ అతిగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు కేంద్రం చేసిందేం లేదని అన్నారు.

‘ఆపరేషన్ గరుడ'పై శివాజీని విచారించాలి

‘ఆపరేషన్ గరుడ'పై శివాజీని విచారించాలి

ఆపరేషన్ గరుడ టీడీపీ సృష్టేనని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి విమర్శించారు. జగన్‌పై దాడి జరుగుతుందని రెండు నెలల క్రితమే చెప్పిన వ్యక్తి, నటుడు శివాజీని ఎందుకు సాక్షిగా చేర్చలేదని ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడపై నిజాలు వెలికి తీయాలని బీజేపీ ఫిర్యాదు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించిందని విష్ణువర్దన్‌రెడ్డి మండిపడ్డారు. శివాజీని అదుపులోకి తీసుకుని విచారించి నిజానిజాలు బయటకు తేవాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Tuesday takes on knife attack on YS Jaganmohan Reddy issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X