వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బలహీనపడటం వల్లే: బాబు ఆవేదన, 'పవన్‌కళ్యాణ్ మాతో కలిస్తే'

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో కాంగ్రెస్ పార్టీ బలపడాలని చూస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో కాంగ్రెస్ పార్టీ బలపడాలని చూస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.

విభజన బిల్లుపై కెవిపి రామచంద్ర రావు సంచలన వ్యాఖ్యలువిభజన బిల్లుపై కెవిపి రామచంద్ర రావు సంచలన వ్యాఖ్యలు

ఒక్క ఎమ్మెల్యే గెలవని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకంగా సభ నిర్వహించే స్థాయికి వచ్చిందన్నారు. రాజకీయాల్లో రిలాక్సేషన్ అనేది ఉండకూడదని చంద్రబాబు చెప్పారు. ఆయన ఉదయం టిడిపి నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హత్య చేసిన వాళ్లే..

హత్య చేసిన వాళ్లే..

రాజకీయాల్లో రోజు రోజుకు పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. విభజన అంశంపై మాట్లాడుతూ.. హత్య చేసిన వాళ్లే పూలదండలతో వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు రాని స్థితి నుంచి సభ నిర్వహించే స్థాయికి ఎదిగిందన్నారు. మహానాడును విజయవంతం చేసిన వారందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు.

పాలు పోసినట్లే..

పాలు పోసినట్లే..

నవ నిర్మాణ దీక్ష, మహా సంకల్పలోను ఇదే స్ఫూర్తి ఉండాలన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజల్లో సంతృప్తి కనిపించాలన్నారు. రాజకీయాల్లో 80 శాతం వరకు ఏకీకరణ జరగాలన్నారు. మనం తప్పు చేస్తే ప్రత్యర్థులకు పాలుపోసినట్లే అవుతుందన్నారు.

పవన్ మాతో కలిస్తే..: రఘువీరా

పవన్ మాతో కలిస్తే..: రఘువీరా

ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో కలిసేందుకు ఒక అడుగు వేస్తే తాము నాలుగు అడుగులు వేస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అన్నారు.

టిడిపి అడ్డు తగులుతోంది

టిడిపి అడ్డు తగులుతోంది

హోదాపై పోరాడుతున్న పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని రఘువీరా చెప్పారు. హోదాకు అన్ని పార్టీలు మద్దతిస్తున్నప్పటికీ టిడిపి అడ్డు తగులుతోందని ధ్వజమెత్తారు. ప్రజల్లో భరోసా కోసమే రాహుల్ సభ అన్నారు.

టిడిపి, వైసిపిలో ఓటు వేయకుంటే.

టిడిపి, వైసిపిలో ఓటు వేయకుంటే.

రాహుల్ గాంధీ సభను విఫలం చేసేందుకు టిడిపి నేతలు తీవ్రంగా ప్రయత్నించారని విమర్శించారు. తమ సభఖు పవన్ కళ్యాణ్, చలసానిలు మద్దతు పలకడం సంతోషకరమన్నారు. టిడిపి, వైసిపిలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకుంటే బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ఓడిపోతుందన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu talks about Congress Party meeting in Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X