కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు రెండుసీట్లలో పోటీ ! మీడియా కథనాల్ని స్వాగతించిన సాయిరెడ్డి-ఎన్టీఆర్, రాహుల్ తో పోలిక

|
Google Oneindia TeluguNews

ఏపీలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేయబోతున్నారన్న ఆసక్తి సర్వత్రా పెరుగుతోంది. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ చేస్తున్న రచ్చతో చంద్రబాబు మరో సేఫ్ ప్లేస్ కూడా వెతుక్కుంటున్నారన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా ఇదే విషయాన్ని నిర్ధారించేలా మరో ఆంగ్లపత్రిక కూడా కథనం ప్రచురించడంతో దీన్ని వైసీపీ స్వాగతించింది. ఈ మేరకు తప్పేంకాదంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు

కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఓటమిపాలైన నియోజకవర్గాలపై ఎంతమేర దృష్టిపెట్టిందో తెలియదు కానీ విపక్ష నేత చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తున్న కుప్పంపై మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. దీని ఫలితమే కుప్పంలో జరిగిన పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలుపు.

దీన్ని సాకుగా చూపుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారంటూ వైసీపీ మొదలుపెట్టిన మైండ్ గేమ్ సహజంగానే చంద్రబాబుకు చుక్కలు చూపిస్తోంది. కుప్పంలో ఈసారి చంద్రబాబు గెలుపుపై ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వైసీపీ కార్యకర్త కూడా మాట్లాడుకుంటున్నాడు. ఈ విషయంలో మాత్రం జగన్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.

 చంద్రబాబు సేఫ్ సీటు వెతుక్కుంటున్నారా?

చంద్రబాబు సేఫ్ సీటు వెతుక్కుంటున్నారా?

కుప్పంలో పరిస్దితులు నానాటికీ ప్రతికూలంగా మారుతున్నట్లు అంచనా వేస్తున్న చంద్రబాబు ఎందుకైనా మంచిదన్న భావనలో మరో సేఫ్ సీట్ కూడా వెతుక్కుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా మీడియాలోనూ దీనిపై కథనాలు రావడం, అదీ ఇంగ్లీష్ మీడియాలో దీనిపై తాజాగా ఓ కథనం రావడంతో ఇది నిజమేనా అన్న చర్చ మొదలైంది.

అయితే ప్రస్తుతం తాను రెగ్యులర్ గా పోటీ చేస్తున్న కుప్పంతో పాటు మరో సేఫ్ సీటులో చంద్రబాబు పోటీ చేయొచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ వర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. చంద్రబాబు మరోసారి కుప్పం నుంచి తప్ప మరోచోటి నుంచి పోటీ చేసే ప్రశ్నే లేదంటున్నాయి.

స్వాగతించిన వైసీపీ

స్వాగతించిన వైసీపీ

చంద్రబాబు కుప్పంతో పాటు మరో సీటు నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రచారాన్ని తొలుత తెరపైకి తెచ్చింది వైసీపీయే. ఇప్పుడు మీడియాలో జరుగుతున్న ఆ ప్రచారాన్ని కూడా వైసీపీ స్వాగతించింది. తాము అనుకున్నట్లుగానే మైండ్ గేమ్ సక్సెస్ అయిందన్న భావనలో వైసీపీ నేతలు కనిపిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు రెండు సీట్ల పోటీ ప్లాన్ పై ఓ భారీ ట్వీట్ పెట్టారు. ఇందులో ఇంగ్లీష్ మీడియా తాజా కథనాన్ని ప్రస్తావిస్తూ రెచ్చిపోయారు. ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఇందులో ఎలాంటి తప్పూ లేదన్నారు. గతంలో చాలా మంది రెండో సీట్లో పోటీ చేశారని, ఎన్నికల సంఘం కూడా దీనికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదంటూ సెటైర్లు వేశారు.

ఎన్టీఆర్, రాహుల్ తో చంద్రబాబుకు పోలిక!

ఎన్టీఆర్, రాహుల్ తో చంద్రబాబుకు పోలిక!

'ముఖ్యమంత్రి స్థాయి' నాయకులు ఎన్నికల్లో ఒకటి కన్నా ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడం తెలుగునాట రాజకీయాల్లో కొత్తేమీ కాదని, తెలుగుదేశం స్థాపకుడు ఎన్‌.టి.రామారావు ఇలా ప్రతిసారీ రెండు మూడు అసెంబ్లీ సీట్ల నుంచి పోటీ చేసి చరిత్ర సృష్టించారని విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం జగన్, చంద్రబాబు వరుస టూర్లతో కుప్పానికి ఈమధ్య విపరీత ప్రచారం వచ్చిందని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో వైసీపీ కుప్పం మీద దృష్టి కేంద్రీకరిస్తుందనే ప్రచారం టీడీపీ బాగా ప్రచారం చేస్తోందని, చంద్రబాబు కుప్పంతో పాటు మరో 'సురక్షిత' స్థానం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాన్ని ఒక ప్రముఖ ఇంగ్లిష్‌ డైలీ ప్రచురించిందని సాయిరెడ్డి పేర్కొన్నారు.

సీఎం పదవికి లేదా ప్రధాని పదవికి పోటీ పడే బడా నేతలు రెండు మూడు సీట్ల నుంచి పోటీ చేయడం తప్పేమీ కాదన్నారు. ఎన్టీఆర్‌ గతంలో ప్రతీసారీ రెండు నుంచి మూడు సీట్లలో పోటీ చేసి గెలిచారని, మధ్యలో కల్వకుర్తిలో మాత్రమే ఓడిపోయారని సాయిరెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ సైతం గత ఎన్నికల్లో అమేథీతో పాటు వాయనాడ్ నుంచి పోటీ చేశారని గుర్తుచేశారు.

English summary
ysrcp mp vijayasai reddy has welcomed chandrababu's plans on contest in two seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X