కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిన్న శోభ కూడా: చంద్రబాబుకు అన్నీ భూమానే! ఫ్యాక్షన్ తగ్గించేందుకు..

నిన్న భూమా శోభా నాగిరెడ్డి, నేడు భూమా నాగిరెడ్డి తన కళ్లను దానం చేశారు. తన కళ్లు దానం చేస్తానని ఇంతకుముందు ఆయన ప్రకటించారు. గతంలో శోభ కూడా బతికున్నప్పుడు కళ్లు దానం చేస్తానని ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: నిన్న భూమా శోభా నాగిరెడ్డి, నేడు భూమా నాగిరెడ్డి తన కళ్లను దానం చేశారు. తన కళ్లు దానం చేస్తానని ఇంతకుముందు ఆయన ప్రకటించారు. గతంలో శోభ కూడా బతికున్నప్పుడు కళ్లు దానం చేస్తానని ప్రకటించారు.

 భూమా నాగిరెడ్డి కన్నుమూత: ఆళ్లగడ్డ కన్నీరుమున్నీరు భూమా నాగిరెడ్డి కన్నుమూత: ఆళ్లగడ్డ కన్నీరుమున్నీరు

అనంతరం 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పుడు ఆమె కళ్లను కుటుంబ సభ్యులు ఇచ్చారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి కూడా ఇచ్చారు.

అన్నీ భూమాతో చర్చించే చంద్రబాబు

కర్నూలు జిల్లాతో భూమా నాగిరెడ్డికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆళ్లగడ్డ నుంచే జిల్లా రాజకీయాలపై ఆయన చెరగని ముద్ర వేశారు. జిల్లాకు సంబంధించిన రాజకీయ అంశాలన్నీ చంద్రబాబు.. భూమాతోనే చర్చించేవారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు భూమా సలహాలు తీసుకునేవారు.
నమ్ముకున్న నాయకుల కోసం భూమా తన వంతు సహాయసహకారం అందించేవారు. పార్టీ కోసం సేవలందించిన కొలిమిగుండ్ల నేత ఎర్రబోతుల వెంకట రెడ్డికి భూమానే అసెంబ్లీ టికెట్‌ ఇప్పించారు.

Chandrababu took key desicions with the help of Bhuma in Kurnool District

ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల ప్రాంతాల్లో ఫ్యాక్షన్‌ తీవ్రత తగ్గించడానికి చేపట్టిన శాంతి పాదయాత్రలకు అనూహ్య స్పందన వచ్చింది. ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లె గ్రామంలో కార్యకర్తలపై దాడి జరిగితే వెంటనే అక్కడికి వెళ్లి వారికి అండగా నిలిచారు.

ఇదీ భూమా నాగిరెడ్డి రాజకీయ జీవితం!ఇదీ భూమా నాగిరెడ్డి రాజకీయ జీవితం!

పోలీసులతో వాగ్వాదానికి దిగి కేసులు ఎదుర్కొన్నారు. కార్యకర్తలే తన ప్రాణం అంటూ పలు సందర్భాల్లో ప్రకటించి వారి కోసం పని చేశారు. నంద్యాల డివిజన్‌ పరిధిలోని 17 మండలాల్లో భూమా చెరగని ముద్రవేశారు.

కార్యకర్తలకు సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా హాజరయ్యేవారు.భూమా మృతితో ఓ గొప్ప నేతను కోల్పోయామని కర్నూలు ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

English summary
TDP chief Chandrababu many times took key desicions with the help of Bhuma Nagi Reddy in Kurnool District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X