వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు విశాఖ పర్యటనపై ఉత్కంఠకు తెర: 25న ఉదయానికి ఏపీలోకి ఎంట్రీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విశాఖపట్నం వెళ్లేందుకు చంద్రబాబుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుమతిచ్చారు. దీంతో చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది.

యూటర్న్ అంకుల్! ఆధారాలున్నాయా?: చంద్రబాబు విశాఖ పర్యటనపై మంత్రి, ఎంపీ సెటైర్లుయూటర్న్ అంకుల్! ఆధారాలున్నాయా?: చంద్రబాబు విశాఖ పర్యటనపై మంత్రి, ఎంపీ సెటైర్లు

సోమవారం ఉదయం 10 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి, ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో భేటీ కానున్నారు.

chandrababu visakha tour confirmed

సోమవారం సాయంత్రం రోడ్డు మార్గంలో చంద్రబాబు అమరావతిలోని తన నివాసానికి చేరుకుంటారు. అయితే, చంద్రబాబు వెంట ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా వస్తారా? లేదా? అనేది తెలియరాలేదు.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 20 నుంచి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండిపోవడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్రాన్ని వదిలేసి పొరుగు రాష్ట్రంలో ఉంటున్నారని ఆరోపించారు.

కాగా, చంద్రబాబు డీజీపీని విశాఖ పర్యటనపై అనుమతి కోరడంపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంతకుముందు స్పందించారు.
చంద్రబాబు విశాఖలో పర్యటిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుచరిత అన్నారు.

Recommended Video

YSRCP Completes 1Year Governance, CM Jagan To Conduct Review Meetings

చంద్రబాబు ఏపీ డీజీపీకి ఎప్పుడు లేఖ రాశారు? డీజీపీకి దరఖాస్తు చేస్తే తగిన ఆధారాలు చూపించాలని సుచరిత అన్నారు. ఏపీలో దరఖాస్తు చేయకుండా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. చంద్రబాబు దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తాం.. ఇందులో ఎలాంటి వివాదం లేదని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్‌లు విశాఖ బాధితులను పరామర్శించారని, వారిని ఎవరూ అడ్డుకోలేదని తెలిపారు.

English summary
TDP chief chandrababu visakha tour confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X