వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు .. వరద బాధితులకు బాబు పరామర్శ

|
Google Oneindia TeluguNews

ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరద నీరు పోటెత్తి కృష్ణా, గుంటూరు జిల్లాలలో పలు లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. అయితే ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టామని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయం చేస్తున్నామని జగన్ సర్కార్ చెప్తున్నా వరద బాదితులకు ప్రభుత్వ సహాయం అందని ద్రాక్షగానే ఉంది. ఈ నేపధ్యంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు, వారిని పరామర్శించేందుకు మాజీ సీఎం చంద్రబాబు నేడు కృష్ణా జిల్లాలోని వరద ముంపు గ్రామాలలో పర్యటించనున్నారు .

కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు

కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు

రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుంటే చంద్రబాబు హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారు అని పలు విమర్శలు వ్యక్తం అయిన నేపధ్యంలో ఎట్టకేలకు చంద్రబాబు కృష్ణానది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు . నేడు ఆయన కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 20న కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ వరద పరిస్థితులను ఆయన పరిశీలించనున్నారు.

వరద ప్రభావాన్ని పరిశీలించనున్న చంద్రబాబు.. వరద బాధితులకు బాబు భరోసా

వరద ప్రభావాన్ని పరిశీలించనున్న చంద్రబాబు.. వరద బాధితులకు బాబు భరోసా

ఇక వరద ధాటికి ఊళ్లకు ఊళ్ళే ముంపుకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయిన నేపధ్యంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులను చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. వరదల కారణంగా నీట మునిగి దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించనున్నారు. పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు పరామర్శించి వారికి మనోధైర్యం నింపటానికి చంద్రబాబు ప్రయత్నం చెయ్యాలి అనుకుంటున్నారు. పడవలు దెబ్బతిన్న మత్స్యకారులను చంద్రబాబు పరామర్శించి ధైర్యాన్ని ఇవ్వనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. వరద బాదితులకు టీడీపీ నేతలు సహాయం అందించనున్నారు. వారికి కావాల్సిన నిత్యావసరాలను అందించనున్నారు.

వరద ముంపులో చంద్రబాబు ఉండవల్లి నివాసం... చంద్రబాబు ఇంటి విషయంలో కొనసాగుతున్న వివాదం

వరద ముంపులో చంద్రబాబు ఉండవల్లి నివాసం... చంద్రబాబు ఇంటి విషయంలో కొనసాగుతున్న వివాదం

మరోపక్క చంద్రబాబు ఉండవల్లి నివాసం కూడా వరద ముంపుకు గురైన విషయం తెలిసిందే. ఇక ఆయన నివాసానికి వరదప్రమాదం ఉందని ఆయన ఇల్లు ఖాళీ చెయ్యాలని ఇంటికి నోటీసులు అంటించారు. ఇక అంతే కాదు చంద్రబాబు ఇంటి మీదడ్రోన్స్ ఎగరవేసిన వ్యవహారంలో కూడా జగన్ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శించిందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇక కోర్టులో ప్రైవేటు కేసు కూడా వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నాయకులు. చేతికి కట్టుతో హైదరాబాద్ లో రెస్ట్ తీసుకున్న చంద్రబాబు నేడు ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు.

English summary
TDP president and former Chief Minister N Chandrababu Naidu will visit the flood affected areas in Krishna district on Tuesday. He will visit Avanigadda, Pammarru, Penamaluru and Vijayawada city. The rank and file of TDP will participate and distribute some material to victims in the flood affected areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X