వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నేతలు కోరితే బాబు అపాయింట్మెంట్.. చంద్రబాబు కడప పర్యటన తో పొలిటికల్ హీట్

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు మూడు రోజులు కడప జిల్లా పర్యటన పై ఇప్పుడు కడప జిల్లాలో పెద్ద చర్చ జరుగుతోంది. అసలు చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు ఎందుకొస్తున్నారో చెప్పాలంటూ వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు ఎందుకు వస్తున్నారు అనేది వైసీపీ నేతలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఒకవేళ వారికి ఎవరికైనా చంద్రబాబు ని కలవాలని ఉంటే తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఇప్పిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలు చెబుతున్నారు.

చంద్రబాబు ఎందుకు వస్తున్నారో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్న టీడీపీ నేతలు

చంద్రబాబు ఎందుకు వస్తున్నారో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్న టీడీపీ నేతలు

ఇక వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ నేతలు చంద్రబాబు ఎందుకు వస్తున్నారో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని, టీడీపీ ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ, అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసే పార్టీ కాబట్టి, అధికారంలో లేకున్నా ప్రజల కోసం పని చేస్తామని టిడిపి నేతలు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు వస్తున్నందుకు ఇంతగా ఉలికిపడుతున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు చంద్రబాబునాయుడును కలుస్తామంటే అపాయింట్‌మెంట్‌ ఇప్పించే ఏర్పాట్లు చేస్తాము అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ .శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

అధికారం శాశ్వతం అని వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని ఆగ్రహం

అధికారం శాశ్వతం అని వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని ఆగ్రహం

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారం శాశ్వతంగా ఉంటుందని ఫీలవుతున్నారని, అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, భ్రమలో నుంచి బయటకు రావాలని టిడిపి నేతలు హితవు పలుకుతున్నారు. మూడు రోజులు చంద్రబాబు పర్యటనలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారని, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని వారు తెలుపుతున్నారు. ఇక చంద్రబాబు కడప జిల్లా పర్యటన షెడ్యూల్ సైతం ప్రకటించారు కడప టిడిపి నేతలు.

చంద్రబాబు మూడు రోజుల కడప పర్యటన ఇలా

చంద్రబాబు మూడు రోజుల కడప పర్యటన ఇలా


25వ తేదీ హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి చంద్రబాబు కడప ఎయిర్‌పోర్టుకు 11.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా రాజంపేట రోడ్డులోని శ్రీనివాస కల్యాణ మండపం చేరుకుంటారు. అక్కడ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల సమీక్షలో పాల్గొంటారు.

సమీక్షలు, సమావేశాలు, పరామర్శలతో సాగనున్న బాబు పర్యటన

సమీక్షలు, సమావేశాలు, పరామర్శలతో సాగనున్న బాబు పర్యటన

26వ తేదీ మంగళవారం వైసీపీ బాధిత కుటుంబాలతో చంద్రబాబు సమావేశమవుతారు. ఇక ఆ తర్వాత ఉదయం 11.30 గంటల నుంచి కడప, మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తారు . గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు, అలాగే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చెయ్యటం పై చర్చిస్తారు. 27వ తేదీ ఉదయం 10 గంటలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి స్వగృహంలో విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.

మాటల దాడి మొదలెట్టిన వైసీపీ ... తిప్పి కొడుతున్న టీడీపీ

మాటల దాడి మొదలెట్టిన వైసీపీ ... తిప్పి కొడుతున్న టీడీపీ

ఇక 27 వ తేదీన 11.30కు వైసీపీ బాధితులైన చక్రాయపేటకు చెందిన కర్నాటి నాగసుబ్బారెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు కడపలో పరామర్శిస్తారు. 12 గంటలకు సెంట్రల్‌ జైలులో రిమాండులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని కలిసి ఆయనను పరామర్శించనున్నారు చంద్రబాబు . ఇక ఆ తర్వాత మధ్యాహ్నం విజయవాడకు బయల్దేరి వెళతారు. మూడు రోజుల పాటు సాగనుంది చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసిపి నేతలు చంద్రబాబు పర్యటన పై అప్పుడే మాటల దాడి మొదలెట్టారు. టిడిపి నేతలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్టుగా కౌంటర్ ఇస్తున్నారు.

English summary
TDP chief and former CM Chandrababu Naidu going to Kadapa district for a three-day visit . But YCP leaders attacking with their questions why Chandrababu is coming ? tdp leaders countering them no need to say about his tour and if they want to meet Chandrababu they should definitely make an appointment of chandrababu . they replied. this situation creates political heat in kadapa politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X