వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రావెల మిస్సింగ్ సీక్రెట్-చంద్రబాబు వద్ద నివేదిక: వేచి చూసి వేటేశారా?

మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబును కేబినెట్ నుంచి తొలగించడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ఆయనను చుట్టుకున్న వివాదాలే మంత్రివర్గం నుంచి తొలగించేలా చేశాయని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబును కేబినెట్ నుంచి తొలగించడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ఆయనను చుట్టుకున్న వివాదాలే మంత్రివర్గం నుంచి తొలగించేలా చేశాయని అంటున్నారు.

రావెల కిషోర్ ఇండియన్ రైల్వే సర్వీస్‌లో పని చేశారు. వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో పత్తిపాటి టిక్కెట్ సంపాదించి గెలుపొందారు. విద్యాధికుడు కావడంతో ఆ తర్వాత వెంటనే మంత్రి అయ్యారు.

<strong>ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పండి: ప్రజలకు రావెల, జానీమూన్ అంశంపై.. </strong>ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పండి: ప్రజలకు రావెల, జానీమూన్ అంశంపై..

అయితే జిల్లా నేతలతో సయోధ్య లేకపోవడం, హైదరాబాదులో తన కొడుకు వివాదం... ఇలా ఎన్నో అంశాలు ఆయనను తప్పించేలా చేశాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

లోకేష్‌ను దాటి చంద్రబాబు దాకా ఫిర్యాదు

లోకేష్‌ను దాటి చంద్రబాబు దాకా ఫిర్యాదు

పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. దీంతో ఆయన గెలిచారు. కానీ కొద్ది కాలానికే ఆయనకు నియోజకవర్గంలో కొందరు దూరమయ్యారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు రావెలపై నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. పత్తిపాడులోని విభేదాలు లోకేష్‌ను దాటి చంద్రబాబు వరకు వెళ్లాయి. నియోజకవర్గంలో మంత్రి ఎవరినీ కలవడం లేదని ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు.

రావెల కొడుకు హంగామా

రావెల కొడుకు హంగామా

దీనికి తోడు రావెల కిషోర్ తనయుడు హైదరాబాద్‌లో సృష్టించిన హంగామా కలకలం రేపింది. ఈ వివాదం సమసిపోయినప్పటికీ... ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తింది.

జానీమూన్‍‌తో గొడవ

జానీమూన్‍‌తో గొడవ

ఇక, గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ జానీమూన్‌ - రావెల మధ్య ప్రారంభమైన వైరం పతాక శీర్షికలకు ఎక్కింది.. తనను మంత్రి రాజకీయంగా వేధిస్తున్నారని జానీమూన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం చెందారు.

పార్టీ నేతలతో విచారణ జరిపించి, నివేదిక తెప్పించుకున్నారు. తనను తొలగిస్తున్నారన్న విషయం తెలుసుకున్న రావెల కిషోర్ బాబు.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముందు రోజు చంద్రబాబును కలిశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. నివేదికను ముందేశారని తెలుస్తోంది.

తనపై కొందరు చేసిన దుష్ర్పచారం కారణంగానే పదవిని కోల్పోవాల్సి వచ్చిందని రావెల ఆవేదన చెందుతున్నారు. తనకు ఎవరి మీదా కోపం లేదని, పార్టీ అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేస్తానని అంటున్నారు.

రావెల అదృశ్యం సీక్రెట్

రావెల అదృశ్యం సీక్రెట్

కాగా, రావెల ఓ రోజు సెక్యూరిటీని పక్కన పెట్టి నాలుగు గంటల పాటు ఎవరికీ తెలియకుండా వెళ్లడం పోలీసు వర్గాలను కలవరపరచింది. ఆయన అంత రహస్యంగా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీశారు.

గంటల పాటు టెన్షన్

గంటల పాటు టెన్షన్

ఈ సంఘటన ఈ ఏడాది జనవరిలో జరిగింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో తన రోజువారీ కార్యక్రమాల్ని ముగించుకొని గుంటూరులోని తన ఇంటికి వచ్చారు రావెల. ఆ సమయంలో ఇంటి బయట భద్రతా సిబ్బంది ఉన్నారు.

సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక కారు మంత్రి రావెల ఇంటికి వచ్చింది. ఏడు గంటల ప్రాంతంలో మంత్రి ఆ కారులో బయటకు వెళ్లారు. ఈ విషయం గన్‌మెన్లకు ఆలస్యంగా తెలిసింది. అరగంట గడిచినా రావెల రాలేదు. దీంతో అందరూ టెన్షన్ ఫీలయ్యారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన ఇంటికి వచ్చారు.

రావెల మిస్సింగ్‌పై బాబుకు నివేదిక.. సమయం చూసి..

రావెల మిస్సింగ్‌పై బాబుకు నివేదిక.. సమయం చూసి..

రావెల ఎక్కడికి వెళ్లారో, ఎవరితో మాట్లాడారో ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారని, ఈ నివేదికను పరిశీలించిన చంద్రబాబు సమయం కోసం వేచి చూశారని, చివరకు వేటు వేశారని చెబుతున్నారు.

English summary
It is said that CM Chandrababu Naidu was waited to take action Against Ravela Kishore Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X