వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోల‌వ‌రానికి అడ్డు త‌గిలితే స‌హించేది లేదు.. కేంద్రాన్ని హెచ్చ‌రించిన బాబు..

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న మ‌హానాడు చివ‌రి రోజున చంద్ర‌బాబు బీజేపి జాతీయ అద్య‌క్షుడు అమీత్ షా ను టార్గెట్ చేసారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో మోదీ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లం చెందింద‌ని మండిప‌డ్డారు. పోల‌వ‌రానికి స‌రైన నిధులు కేటాయించ‌కుండా అవినీతి జ‌రింద‌ని చెప్ప‌డం మంచిది కాద‌ని తెలిపారు.

Recommended Video

TDP Mahanadu 2018 : Chandrababu Naidu Speech
 పోల‌వ‌రానికి ఎన్ని నిధులు ఇచ్చ‌రో లెక్క చెబుతా.. అవినీతి జ‌రిగింద‌ని నిరూపించ‌గ‌ల‌రా..

పోల‌వ‌రానికి ఎన్ని నిధులు ఇచ్చ‌రో లెక్క చెబుతా.. అవినీతి జ‌రిగింద‌ని నిరూపించ‌గ‌ల‌రా..

చివ‌రి రోజు మ‌హానాడులో కేంద్ర ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లకు ప‌దును పెంచారు చంద్ర‌బాబు. పోల‌వ‌రం ప్రాజెక్టు అంశంలో ఆధారాలు లేకుండా మాట్లాడినా, అనుచిత వాఖ్య‌లు చేసినా స‌హించేది లేద‌ని బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమీత్ షాను హెచ్చ‌రించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు తెలుగు ప్ర‌జ‌ల జీవ‌నాడిగా రూపుదిద్దుకుంటున్న త‌రుణంలో కేంద్రం ఆ ప్రాజెక్టుపైన లేనిపోని భ్ర‌మ‌లు క‌ల్పిస్తోంద‌ని అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వ‌కుండా ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు చూపించాల‌న‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం ప్రాజెక్టును రాష్ట్ర ఖ‌జానాతో నిర్మించుకునే స‌త్తా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఉంద‌ని తెలిపారు. మ‌హ‌నాడు మూడో రోజున ప్రాజెక్టుల నిర్మాణం తీర్మానంపై ప్ర‌సంగించిన చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ఆవ‌శ్య‌క‌త‌,వ్య‌యంతో పాటు ఎప్ప‌టి లోపు పూర్త‌వుతేందో వంటి అంశాల‌ను పార్టీ శ్రేణుల‌కు వివ‌రించారు చంద్ర‌బాబు. లోటుబ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్రం అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల స‌హ‌కారంతో ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని తెలిపారు.

నిదులు ఇవ్వ‌డంలో వివ‌క్ష చూపుతున్న‌ది వాస్త‌వం కాదా...

నిదులు ఇవ్వ‌డంలో వివ‌క్ష చూపుతున్న‌ది వాస్త‌వం కాదా...

వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హానికి, దులేరా న‌గ‌ర నిర్మాణాల‌కు పెద్ద ఎత్తున నిధులు ఖ‌ర్చుపెడుతున్న మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇవ్వ‌డంలో ఎందుకు వెనుక‌డుగు వేస్తున్నారో అర్ధం కావ‌డం లేద‌ని మండి ప‌డ్డారు. బిజెపి కుటిల రాజ‌కీయాల‌ను తెలుగు ప్ర‌జ‌లు అర్ధం చేసుకున్నార‌ని రాబోయే ఎన్నిక‌ల్లో వారే బిజెపి ప్ర‌భుత్వానికి గుణాపాఠం చెబుతార‌ని అన్నారు. ఢిల్లీకి రెండు రెట్లు అధిక సిటీని నిర్మిస్తున్న మోడీకి అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం గురించి తెలియ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.ఎన్నిక‌ల‌కు ముందు తిరుప‌తి, విజ‌య‌న‌గ‌రం లాంటి న‌గ‌రాల్లో మోడీ ఇచ్చిన వాగ్దానాల‌ను పూర్తిగా విస్మ‌రించ‌డ‌మే కాకుండా అభివృద్ధికి ఆటంకాలు సృష్టించ‌డం మంచిప‌ద్ధ‌తి కాద‌ని అన్నారు. దులేరా న‌గ‌ర నిర్మాణం సంద‌ర్భంగా మోడీ ప్ర‌సంగించిన వీడియో టేపుల‌ను మ‌హానాడు ప్రాంగణంలో ప్ర‌ద‌ర్శించారు.

అనుచిత వాఖ్య‌లు మానుకోండి.. అమీత్ షా కి బాబు చుర‌క‌లు...

అనుచిత వాఖ్య‌లు మానుకోండి.. అమీత్ షా కి బాబు చుర‌క‌లు...

అంతకు ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మోడీచేసి వాగ్దానాల వీడియోను కూడా ప్ర‌జ‌ల‌ముందు ఉంచే ప్ర‌య‌త్నం చేశారు చంద్ర‌బాబు. కేంద్ర ప్ర‌భుత్వ నాలుగు బ‌డ్జెట్ ల‌లో కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఏమేర‌కు కేటాయింపులు చేశారో త‌మ వ‌ద్ద లెక్క‌లు ఉన్నాయ‌ని తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు మొద‌టి బ‌డ్జెట్ లో వంద కోట్లు కేటాయించి అవ‌మానించార‌ని అన్నారు. నాలుగు సంవ‌త్స‌రాలుగా కేంద్ర స‌హాయం కోసం ఎదురు చూసిన‌ప్ప‌టికీ మోడీ ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రాన్నిప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం పార్టీ బిజెపితో ఎందుకు మిత్ర‌ప‌క్షంగా విడిపోయిందో పార్టీ శ్రేణుల‌కు వివ‌రించారు చంద్ర‌బాబు. రాష్ట్ర బిజెపినాయ‌క‌త్వంతో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసిపి తెలుగుదేశం పార్టీపైన నింద‌లు మోపే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ప్రాజెక్టుల అంశంలో ఎక్క‌డ అవినీతి జ‌రిగిందో నిరూపించే స‌త్తా వైసిపికి రాష్ట్ర బిజెపికి స‌త్తా ఉందా అని ప్ర‌శ్నించారు.

పోల‌వ‌రం పూర్తి చేసి తీరుతాం.. తెలుగువాడి పౌరుషాన్ని చాటుతాం..

పోల‌వ‌రం పూర్తి చేసి తీరుతాం.. తెలుగువాడి పౌరుషాన్ని చాటుతాం..

తెలుగుదేశం పార్టీ పార‌ద‌ర్శ‌కంగా ప‌రిపాల‌న కొన‌సాగిస్తూ.... అభివృద్ధి వైపు దూసుకెళుతుంటే స‌హ‌క‌రించాల్సింది పోయి విమ‌ర్శించ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని అన్నారు. బిజెపి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసిన విధానాల‌ను ప్జ‌ల ముందు ఉంచే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల కేంద్ర‌ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌గిన గుణపాఠం చెబుతార‌ని అన్నారు. బిజెపికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒక్క సీటు గెలుచుకునే అవ‌కాశం లేద‌ని మండి ప‌డ్డారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో చెల‌గాటం అడిన మోడీ, అమీత్ షా లు తెలుగు ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌ద‌ని అన్నారు. ఎవ‌రు ఎన్ని అడ్డంకులు సృష్టించినా....పోల‌వ‌రం నిర్మాణం పూర్తి చేసి తీరుతామ‌ని మ‌హాన‌డు వేదిక సాక్షిగా చంద్ర‌బాబు పేర్కొన్నారు.

English summary
telugudesham party national president chandrababu naidu targetted amith sha in issue of polavaram. babu alleged that amith sha speeking with half knowledge regarding polavaram project.and also babu said central government not giving sufficient funds to polavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X