• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రుణమాఫీపై కోర్టుకెళ్తా ... రైతులు రుణమాఫీ కోసం జగన్ ను నిలదీయండి అన్న చంద్రబాబు

|

ఏపీ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చెయ్యకుండా దారుణంగా ప్రవర్తిస్తుంది అని ఏపీ మాజీ సీఎం జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం రుణమాఫీ డబ్బులివ్వకపోతే కోర్టుకెళ్లడానికి కూడా వెనుకాడమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు రుణ మాఫీ కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు .

తెరమీదకు దేశ రెండో రాజధాని అంశం .. జగన్ క్లారిటీ ఇవాలన్న ఎంపీ టీజీ వెంకటేష్

రాష్ట్ర ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామన్న చంద్రబాబు

రాష్ట్ర ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామన్న చంద్రబాబు

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ హయాంలో అమలు చేసన పథకాల్లో అవినీతి జరిగింది అంటూ వాటిని పక్కన పెడుతుంది. ఇక చంద్రబాబు టార్గెట్ గా ఎంక్వైరీలు వేస్తూ చంద్రబాబుపై దాడికి దిగుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం తనను ఎన్ని అవమానాలకు గురిచేసినా ప్రజల కోసమే వాటిని భరిస్తున్నట్టు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు . ఇక రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతుంది అని చెప్పి రాజకీయ దాడులు, బెదిరింపు ధోరణి చూస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావడం లేదన్నారు చంద్రబాబు . కార్యకర్తలు అధైర్య పడవద్దని, పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.

రైతుల రుణ మాఫీ చెయ్యకుంటే కోర్టుకు వెళ్తామన్న చంద్రబాబు

రైతుల రుణ మాఫీ చెయ్యకుంటే కోర్టుకు వెళ్తామన్న చంద్రబాబు

రైతులకు 4, 5వ విడత రుణమాఫీ డబ్బులు ఇంతవరకూ చెల్లించలేదని పేర్కొన్న చంద్రబాబు రైతులకు ప్రామిసరీ నోట్లు ఇచ్చామని వాటితో ప్రభుత్వంపై పోరాటం చెయ్యాలని సూచించారు . రుణమాఫీ చేయకుండా జగన్ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని రైతులతో కలిసి కోర్టుకు వెళ్తామని స్పష్టంచేశారు. టీడీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ఎన్నో మంచి పథకాలను వైసీపీ ప్రభుత్వం పక్కనబెట్టిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ది అంతా అరాచకమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ను రైతులు రుణమాఫీ కోసం నిలదీయండి.. ప్రామిసరీ నోట్లు చూపించి ప్రశ్నించండి అన్న చంద్రబాబు

జగన్ ను రైతులు రుణమాఫీ కోసం నిలదీయండి.. ప్రామిసరీ నోట్లు చూపించి ప్రశ్నించండి అన్న చంద్రబాబు

టీడీపీ టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న చంద్రబాబు రాజధానిలో నిర్మాణాలు ఆపేయడం,పోలవరం నిర్మాణం ఆపటం , అన్నా క్యాంటీన్లను మూసివేయడం, ఇసుక విధానం రద్దుచేయడం వలన ఎంతో మంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. రైతులు రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నారని, వారికి రుణమాఫీ డబ్బులు ఇవ్వకపోతే కోర్టుకెళ్లేందుకు కూడా వెనుకాడబోమని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు చంద్రబాబు . ఇక రుణమాఫీ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదో రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. తమ హయాంలో రైతులకు ప్రామిసరీ నోటు ఇచ్చామని చెప్పిన చంద్రబాబు అది ప్రభుత్వం తరపున ఇచ్చినదని, అధికారంలో ఎవరున్నా దానిని అమలు చేయాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandranabu has warned the Jagan government that the farmers are suffering from debt and are not hesitant to go to court if they are not paid the loan reviver . Farmers are called to question ycp government why they are no longer paying the debt. Chandrababu said that the farmers were given promissory note during their tenure and that it was issued on behalf of the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more