వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందక్రిష్ణ వెనక ఎవరున్నారో అందరికి తెలుసు...? వైసీపీ ఎంపీ నందిగాం సురేశ్

|
Google Oneindia TeluguNews

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై బాపట్ల వైఎస్సార్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్ ధ్వజమెత్తాడు. మందకృష్ణ మాదిగ వెనుక పరోక్షంగా చంద్రబాబు ఉన్నాడని ఆరోపణలు చేశాడు. మంద క్రిష్ణ చేసే హడావుడి వ్వవహారాలు దళితులకు తెలుసని పేర్కోన్నారు.. దళితుల అభివృద్ది కోసం సీఎం జగన్ చేస్తున్న కృషిని అడ్డుకోవాలన్నదే మందకృష్ణ ఉద్దేశమని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం దళితులకు దగ్గరవుతుంటే మందకృష్ణకు భయం పట్టుకుందని ఆయన ఆరోపించారు.

రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి వచ్చి మందక్రిష్ణ ఈ హడావుడి ఎందుకో చేశాడో అందరికి తెలుసని అన్నారు. . కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రిని పోగిడిన మందక్రిష్ణ ...ఇప్పుడు తిట్టడం వెనకున్న ఆంతర్యం ఏంటని నిలదీశారు. దళితులకు ఏం చేయాలో జగన్‌కి తెలుసన్నారు. మందకృష్ణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.దళితులకు మేలు జరిగితే తనపబ్బం గడవదనే మందకృష్ణ ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. జగన్‌తో మాట్లాడేందుకు సమయం ఇస్తామన్నా.. రాకుండా గొడవలు సృష్ణించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Chandrababu was behind Madakrishna Madiga:YSRCP MP Nandigam Suresh

సమస్యలుంటే పరిష్కరించుకుందామని మందకృష్ణకు సూచించారు. ధర్నాలు, బంద్‌లు లాంటి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. అయినా వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్నారు. రాష్ట్ర పరిధిలోనికి రాదని చెప్పారు. వర్గీకరణ జరిగితే దేశం మొత్తం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక్క ఏపీలోనే కాదన్నారు. దళితులను అన్ని రకాలుగా ఆదుకుంటానని జగన్ హామీ ఇచ్చారని స్పష్టంచేశారు. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు కల్పించారన్నారు. అలాగే పథకాల్లో ఎస్సీలకు మేలు జరిగేలా చేస్తున్నారని వెల్లడించారు.
English summary
YSRCP MP Nandigam Suresh lashed out at MRPS President Mandakrishna Madiga. He alleged that Chandrababu was behind Madakrishna Madiga. Mandakrishna intention is stopped development of the dalits doing by the cm jgan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X