వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్: బీజేపీతో తేల్చేయాలని బాబుపై ఊగిపోయిన టీడీపీ నేతలు, ఎంపీలు, ఆదివారం కీలకభేటీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర బడ్జెట్ పైన ఏపీలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉంది. సాధారణ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు, సుజనా చౌదరి, అవంతి శ్రీనివాస్, జేసీ దివాకర్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, మరో నాయకుడు కొణతాల రామకృష్ణ.. ఇలా అందరూ విరుచుకుపడ్డారు.

చదవండి: బడ్జెట్: బాబు సహనం పరీక్షించొద్దని వర్ల వార్నింగ్, మూడు.. జేసీ సంచలన వ్యాఖ్యలు

చదవండి: కేంద్రంపై విజయసాయి రెడ్డి ఫైర్: జగన్ చెప్తే రాజీనామా, కానీ మెలిక, విశాఖలో నిరసన

బడ్జెట్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులుతో భేటీ అయ్యారు. అంతకుముందు ఎంపీలు, టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు కూడా బడ్జెట్ పైన మండిపడుతున్నాయి.

చదవండి: ఉద్యోగులకు షాక్: ఆదాయ పన్నుపై వేతన జీవులకు ఊరటనివ్వని జైట్లీ

చదవండి: ఏంటిది!: బడ్జెట్‌పై బాబు తీవ్ర అసంతృప్తి, త్యాగానికి సిద్ధమని సుజనా, 'చాలా దుర్మార్గం'

చంద్రబాబుపై నేతల ఒత్తిడి

చంద్రబాబుపై నేతల ఒత్తిడి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. విభజన హామీలను దృష్టిలో పెట్టుకున్నట్లు బడ్జెట్‌లో కనిపించలేదని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. రైల్వే జోన్ సహా ఏ అంశంపై ఆశించినట్లుగా రాలేదన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడమే ఉత్తమమని వారు ఒత్తిడి చేశారని తెలుస్తోంది.

ఊగిపోయిన టీడీపీ నేతలు, ఆదివారం నాడు కీలక భేటీ

ఊగిపోయిన టీడీపీ నేతలు, ఆదివారం నాడు కీలక భేటీ

చంద్రబాబు గురువారం అందుబాటులో ఉన్న నేతలతో భేటీ అయ్యారు. మరికొందరితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ నేతలు ఊగిపోయారు. దీంతో అందరిని సముదాయించి ఆదివారం నాడు అందరే భేటీ అవుదామని చంద్రబాబు సూచించారని తెలుస్తోంది. ఆదివారం ముఖ్య నేతలు అందరూ భేటీ కానున్నారు.

ఆదివారం అత్యవసర భేటీ, కీలక నిర్ణయం

ఆదివారం అత్యవసర భేటీ, కీలక నిర్ణయం

ఆదివారం నాటి భేటీలో చంద్రబాబు, టీడీపీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీ నేతలు ఒత్తిడి తెస్తే.. ఏపీకి ఇప్పటికీ అన్యాయం జరుగుతుందని తేలితో బీజేపీకి రాం రాం చెప్పవచ్చునని అంటున్నారు. దీంతో ఆదివారం అత్యవసర భేటీ భేటీ కీలకంగా మారింది.

పొత్తుపై తేల్చండి.. మనకూ నష్టం

పొత్తుపై తేల్చండి.. మనకూ నష్టం


విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. పొత్తులపై ఏదో ఒకటి తేల్చుకుందామని కొందరు సూచించారు. ఇలా సాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పాటు మనకు కూడా నష్టం జరుగుతుందని చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు.

అప్పటి వరకు వేచి చూద్దామని కొందరి సూచన

అప్పటి వరకు వేచి చూద్దామని కొందరి సూచన

పొత్తుపై ఏదో ఒకటి తేల్చాలని కొందరు నేతలు సూచించడంతో చంద్రబాబు ఆదివారం మరోసారి భేటీ అవుదామని చెప్పారు. మరికొందరు నేతలు మాత్రం ఓ సూచన చేశారని తెలుస్తోంది. కేంద్రం ఏపీపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని, అయితే బడ్జెట్ ఆమోదం పొందే వరకు వేచి చూద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏపీ ఆర్థిక మంత్రి యనమల కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతులు చూస్తే తెలుస్తుందన్నారు.

చంద్రబాబు ఒత్తిడి తేవాలి.. కొణతాల ఆగ్రహం

చంద్రబాబు ఒత్తిడి తేవాలి.. కొణతాల ఆగ్రహం

టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా గళం విప్పాలని కొణతాల రామకృష్ణ అన్నారు. మోడీ ప్రభుత్వంపై చంద్రబాబు తేవాలని డిమాండ్ చేశారు. పైసా ఖర్చు లేని రైల్వే జోన్‌పై ఆలస్యం చేయడం సరికాదన్నారు. నాలుగేళ్లుగా ఏం చేయలేదని, ఇప్పుడూ ఏం చేయలేదన్నారు. రాహుల్ గాంధీకి అన్నీ వివరించామని చెప్పారు.

సహనానికి హద్దుంటుందని అవంతి శ్రీనివాస్

సహనానికి హద్దుంటుందని అవంతి శ్రీనివాస్

ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, నాలుగేళ్లయినా నిధులు ఇవ్వలేదని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ విమర్శించారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ఓర్పు, సహనానికి ఓ హద్దు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేదన్నారు. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రం అర్థం చేసుకోవాలన్నారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి నాలుగేళ్లుగా సహనంతో ఉన్నామని చెప్పారు.

అందరికిచ్చినట్లు మాకిస్తామంటే ఎలా

అందరికిచ్చినట్లు మాకిస్తామంటే ఎలా

అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు ఇచ్చామో అదే విధంగా ఏపీకి కూడా ఇస్తామంటే ఎలాగని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. చాలాసార్లు తాము కేంద్ర మంత్రులతో భేటీ అయ్యామని, చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వచ్చారన్నారు. అయినప్పటికీ ఏపీ గురించి పట్టించుకోకపోతే ఎలాగని నిలదీశారు.

బాబు చెప్పినట్లే, అవసరమైతే రాజీనామా

బాబు చెప్పినట్లే, అవసరమైతే రాజీనామా

కొత్త రాజధానిని ఏ రాష్ట్రమూ నిర్మించడం లేదని, లోటు బడ్జెట్‌తో రాష్ట్ర పాలనను ప్రారంభించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఏపీ తప్ప లోటు బడ్జెట్ ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఏపీ విభజన తర్వాత నష్టపోయిందని, వెనకబడి ఉన్న ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రత్యేకంగా ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని చెబుతున్నామని, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనకే ఉంటామని చెప్పారు. అవసరమైతే రాజీనామా చేయమని చెప్పినా చేస్తామన్నారు.

కేంద్రాన్ని అడుక్కోవలసి వస్తోంది

కేంద్రాన్ని అడుక్కోవలసి వస్తోంది

తాము రాష్ట్రానికి కావాల్సిన నిధులను అడిగింది ఒక లెక్కలో ఉంటే వారు ఇచ్చేది మరో లెక్కలో ఉంటోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, అది నిర్ణీత సమయంలో పూర్తి చేసే బాధ్యత కేంద్రందే అన్నారు. దానికి కూడా తామే కేంద్రాన్ని అడుక్కోవలసి వస్తోందన్నారు. ఏపీకి న్యాయం చేస్తున్నామని చెప్పడానికి ఏపీకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాల్సిందన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu will decide alliance with BJP on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X