వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌పై తప్పులో కాలేసిన చంద్రబాబు: రాజ్యసభకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో ఓ తప్పుడు సమాచారం ఇచ్చారు. అది తెలిసి ఇచ్చారా, తెలియక ఇచ్చారా అనేద పక్కన పెడితే అది పూర్తిగా తప్పు అనే విషయం నిర్ధారణ అవుతోంది.

వైఎస్ రాజశేఖర రెడ్డికి టికెట్ ఇవ్వాలని తానే ఇందిరా గాంధీకి చెప్పానని, ఇద్దరం కలిసే తిరిగే వాళ్లమని, తమ వైరమేమీ లేదని, తర్వాత తాను టిడిపిలోకి వచ్చానన, వైఎస్ కాంగ్రెసులోకి వచ్చారని చంద్రబాబు అన్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రికలో అచ్చయింది.

వైఎస్ పోటీ ఆ పార్టీ నుంచి...

వైఎస్ పోటీ ఆ పార్టీ నుంచి...

చంద్రబాబు, వైఎస్ శాసనసభకు పోటీ చేసిన సమయంలో ఇద్దరు ఒకే పార్టీలో లేరనే విషయం తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి భారత కాంగ్రెసు పార్టీ (ఐఎన్‌‌సి) తరఫున పులివెందుల నుంచి పోటీ చేశారు. ఆప్పుడు ఆయన డి. నారాయణ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచారు.

Recommended Video

Chandrababu Naidu Warning to YS Jagan Over Investments
 చంద్రబాబు పోటీ చేసింది...

చంద్రబాబు పోటీ చేసింది...

ఆ ఎన్నికల్లో చంద్రబాబు భారత కాంగ్రెసు పార్టీ (ఇందిర) అంటే ఐఎన్‌సి (ఐ) పార్టీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన కొంగర పట్టాభిరామ చౌదరిపై 3 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

 ఇద్దరు ఒకే పార్టీ నుంచి పోటీ చేయలేదు..

ఇద్దరు ఒకే పార్టీ నుంచి పోటీ చేయలేదు..

చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకే పార్టీ నుంచి పోటీ చేయలేదనేది స్పష్టం. రాజశేఖర రెడ్డి ఐఎన్‌సి నుంచి పోటీ చేయగా, చంద్రబాబు ఐఎన్‌సి (ఐ) నుంచి పోటీ చేశారు. చంద్రబాబు పోటీ చేసింది ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీ నుంచి కాగా, వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేసింది రెడ్డి కాంగ్రెసు పార్టీ నుంచి. అందువల్ల ఇందిరా గాంధీకి చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డికి అసెంబ్లీ సీటు ఇప్పించారనే మాటలో నిజం లేదని తెలిసిపోతోంది.

కాసు బ్రహ్మానంద రెడ్డి ఇలా...

కాసు బ్రహ్మానంద రెడ్డి ఇలా...

1977 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెసు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్ోల కాసు బ్రహ్మానంద రెడ్డి గెలిచాడు. ఆయన తెలుగువారే. ఆయనకు ఇందిరా గాంధీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమెను కాసు బ్రహ్మానంద రెడ్డ పార్టీ నుంచి బహిష్కరించారు.

 కాంగ్రెసు చీలిపోయింది...

కాంగ్రెసు చీలిపోయింది...

తనను కాసు బ్రహ్మానంద రెడ్డ బహిష్కరించడంతో ఇందిరా గాంధీ కాంగ్రెసు పార్టీని స్థాపించింది. కాంగ్రెసు రెండుగా చీలిపోయిందని చెప్పాలి. ఇందిర పెట్టిన కాంగ్రెసు పార్టీని ఇందిరా కాంగ్రెసు - ఐఎన్‌సి (ఐ) పిలిచేవారు. కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెసు పార్టీని రెడ్డి కాంగ్రెసు పార్టీ అని పిలిచేవారు. చంద్రబాబు ఇందిరా కాంగ్రెసు నుంచి పోటీ చేయగా, వైఎస్ రెడ్డి కాంగ్రెసు నుంచి పోటీ చేశారు. ఇద్దరు వేర్వేరు కాంగ్రెసు పార్టీల నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత క్రమంగా రెడ్డి కాంగ్రెసు కనుమరుగైంది.

 రాజ్యసభకు వేమూరి రాధాకృష్ణ

రాజ్యసభకు వేమూరి రాధాకృష్ణ

రాజ్యసభకు ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబ నాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడనే విషయం అందిరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ సీట్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

English summary
According to Vemuri Radhakrishna's Andhrajyothy report Andhra Pradesh CM Nara Chandrababu Naidu words on YS rajasekhar Reddy was wrong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X