వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీజీపీకి చంద్రబాబు మరో లేఖ .. దేశంలో ఏపీ పోలీసులపైనే ఎక్కువ కేసులు ..పనితీరుకు ఇదే అద్దం అంటూ

|
Google Oneindia TeluguNews

టిడిపి అధినేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటం, శాంతిభద్రతలు క్షీణించడం, ప్రాథమిక హక్కులను కాలరాయడం వంటి అనేక అంశాలపై లేఖ రాసిన చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అనేక దుర్ఘటనలకు , రాజ్యాంగ ఉల్లంఘనలకు వేదికగా మారిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పోలీసులపై అత్యధికంగా వ్యక్తిగత కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరుకు అద్దం పడుతుందని డీజీపీకి తన లేఖ ద్వారా స్పష్టం చేశారు.

కుల రాజకీయాలు, దళితులపై దాడులు గాంధీజీ మార్గంలో ఎదిరిద్దాం : చంద్రబాబు ,లోకేష్ ట్వీట్స్కుల రాజకీయాలు, దళితులపై దాడులు గాంధీజీ మార్గంలో ఎదిరిద్దాం : చంద్రబాబు ,లోకేష్ ట్వీట్స్

 పోలీసులపై ప్రజలకు విశ్వాసం పూర్తిగా పోయింది

పోలీసులపై ప్రజలకు విశ్వాసం పూర్తిగా పోయింది

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస దుర్ఘటనలన్నీ ప్రజలకు పోలీసులపై పూర్తి విశ్వాసాన్ని పోగొట్టాయి అని మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజమండ్రి ఎస్పీ కార్యాలయం ఎదుట షేక్ సత్తార్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోడానికి పోలీసులు ఒత్తిళ్లే కారణమని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి బయట పార్కు చేసిన కారు పై దాడి ఘటనను కూడా చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు.

 భావ ప్రకటనా స్వేచ్చ, వాక్ స్వాతంత్ర్యం పై దాడులు నిత్య కృత్యంగా మారాయి

భావ ప్రకటనా స్వేచ్చ, వాక్ స్వాతంత్ర్యం పై దాడులు నిత్య కృత్యంగా మారాయి

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని, రాజ్యాంగ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 (1) ఏ కింద కల్పించిన వాక్ స్వాతంత్రం పై, భావప్రకటన స్వేచ్ఛ పై దాడులు నిత్యకృత్యంగా మారాయి అని చంద్రబాబు గౌతమ్ సవాంగ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక విధానాలను గురించి మీ దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

 పోలీసుల ఉదాసీనత మంచిది కాదన్న చంద్రబాబు

పోలీసుల ఉదాసీనత మంచిది కాదన్న చంద్రబాబు


వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిని వేధించటం, బెదిరించడం, హింసాత్మక దాడులకు పాల్పడడం, ఆస్తుల విధ్వంసం కార్యక్రమాలు కొనసాగించడం, అర్ధరాత్రులు అరెస్టులు చేయడం, అసభ్య ప్రచారం చేయడం, దుర్భాషలాడటం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం జరుగుతోందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసులపై మండిపడ్డ చంద్రబాబు పోలీసులు ఉదాసీనత, నిష్క్రియాపరత్వం అవాంఛనీయమైనదని, రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనిదని పేర్కొన్నారు చంద్రబాబు .

 దేశంలోనే ఏపీ పోలీసులపై ఎక్కువ వ్యక్తిగత కేసులు ..పనితీరుకు ఇదే అద్దం

దేశంలోనే ఏపీ పోలీసులపై ఎక్కువ వ్యక్తిగత కేసులు ..పనితీరుకు ఇదే అద్దం

పోలీసులు రాష్ట్రంలో చట్ట నిబంధనలు సక్రమంగా అమలు చేయకపోవడం, అధికార పార్టీతో కుమ్మక్కు కావడం, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే అత్యధికంగా వ్యక్తిగత కేసులు నమోదు కావడం రాష్ట్రానికే కళంకం అన్నారు చంద్రబాబు. ఎన్సిఆర్బి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పోలీసులపై మొత్తం 4068 కేసులు నమోదైతే అందులో 1681 కేసులు అంటే 41 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నమోదు కావడం ఆందోళనకరమైనదని చంద్రబాబు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో పోలీసుల పనితీరు కు ఎన్ సి ఆర్ బీ నివేదికలోని ఈ కేసుల సంఖ్య అద్దం పడుతుందని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు , అరాచకాలు ,.. పోలీసుల తీరు విచారకరం

రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు , అరాచకాలు ,.. పోలీసుల తీరు విచారకరం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న టిడిపి నాయకులపై వరుసగా దాడులు జరుగుతుంటే పోలీసులు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. టిడిపి నాయకులపైన మాత్రమే కాకుండా బీసీ ,ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు ,మహిళలు, జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, శిరోముండనాలు యదేచ్ఛగా రాష్ట్రంలో కొనసాగుతుండడం విచారకరమని చంద్రబాబు పేర్కొన్నారు.

Recommended Video

Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!
దురుద్దేశ పూర్వకంగానే దాడులు .. డీజీపీకి మరోసారి లేఖ రాసిన చంద్రబాబు

దురుద్దేశ పూర్వకంగానే దాడులు .. డీజీపీకి మరోసారి లేఖ రాసిన చంద్రబాబు

దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పై దాడులు దురుద్దేశ పూర్వకంగా జరుగుతున్నాయన్నారు చంద్రబాబు. ఇటువంటి పరిస్థితులలో ప్రజలను కాపాడే ప్రయత్నాలు చేయడానికి బదులు, పోలీసులు కూడా వైసీపీ ప్రభుత్వానికి సహకరించడం ఆందోళనకరమని చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పలుమార్లు పలు సందర్భాల్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసిన చంద్రబాబు తాజాగా మరో మారు పోలీస్ వ్యవస్థపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని చంద్రబాబు తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
TDP chief and former CM Chandrababu Naidu wrote a letter to AP DGP Gautam Sawang. Chandrababu wrote a letter on various issues such as committing constitutional violations in the state, deteriorating law and order and denial of fundamental rights. Former CM Chandrababu said AP was the first state to register the highest number of personal cases against police across the country. He made it clear in his letter to the DGP that it would mirror the performance of the police in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X