వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ నిర్ణయాలతో దేశంలో విప్లవాత్మక మార్పులు: సైన్స్ కాంగ్రెస్‌లో చంద్రబాబు

మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

BJP Shock To Chandrababu, Modi-Jagan Meet Creates Ripples in AP Politics | Oneindia Telugu

తిరుపతి: భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలను ఉటంకిస్తూ.. ప్రధాని నిర్ణయాల వల్ల దేశం సాంకేతిక రంగంలో దూసుకెళ్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తిరుపతిలో నిర్వహిస్తున్న 104వ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడారు.

నోట్ల రద్దు, జీఎస్టీ.. వంటి రెండు కీలక నిర్ణయాలను ప్రధాని తీసుకున్నారని, ఈ రెండు ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని ఈ సందర్బంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రెండు నిర్ణయాల ద్వారా ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి వాటిని తరిమికొట్టవచ్చని అవినీతిపరులకు ఇది పెద్ద దెబ్బ అని అన్నారు.

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడికి లాభం కలుగుతుందని, శాస్త్ర సాంకేతిక రంగాల సేవలు సామాన్యుడికి అందాలన్న ఉద్దేశ్యంతోనే మోడీ డిజిటల్ ఇండియా కాన్సెప్టును ముందుకు తీసుకెళ్తున్నారని చంద్రబాబు తెలిపారు. నోట్ల రద్దును ప్రశంసిస్తూ.. తద్వారా రాజకీయ అవినీతిని నియంత్రించవచ్చు అని చెప్పారు.

Chandrabau speaks in science congress meet in tirupati

డిజిటల్ లావాదేవీల ద్వారా 'షాపింగ్ మాల్స్ తగ్గుతాయి, షాపింగ్ పెరుగుతుంది, బ్యాంకు బ్రాంచులు తగ్గుతాయి, బ్యాంకు సేవలు పెరుగుతాయని' అన్నారు. ఇవాళ మీ వేలే మీ బ్యాంకు అన్న సంగతి గుర్తురెగాలన్నారు. రాష్ట్రాన్ని డిజిటల్ గా మార్చే క్రమంలో రూ.149కే 15ఎంబీపీఎస్ ఇంటర్నెట్ కేబుల్ టీవి అందించే ప్రయత్నం చేయబోతున్నామని అన్నారు.

ఇందుకోసం రూ.5వేల కోట్లతో ఫైబర్ గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చినట్టుగా చంద్రబాబు తెలియజేశారు.
అతి తక్కువ ధరతో విప్లవాన్ని తీసుకొచ్చే దిశగా తాము అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్ని భారత్ వైపే చూస్తున్నాయని, శాస్త్ర సాంకేతిక రంగంలో ఇండియన్స్ పాత్ర చాలా ఉందని పేర్కొన్నారు.

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో సదస్సు నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాని చంద్రబాబు అన్నారు. ప్రతీ వ్యక్తి తమ జీవితకాలంలో తిరుపతిని సందర్శించుకోవాలనుకుంటారని పేర్కొన్నారు.

English summary
AP CM Chandrabau Naidu speaks on Technology development in india at science congress meet, tirupati
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X