వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు తుప్పు...చినబాబు పప్పు:ప్రసంగం స్టైల్ మార్చిన జగన్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి:ఎపిలో ప్రధాన రాజకీయ పార్టీలు టిడిపి, వైసిపి,జనసేన అధినేతల ప్రసంగాల స్టైల్ చూస్తే ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్...అయితే వీరిందరి స్పీచ్ ల్లో కామన్ గా కనబడే ఒక పాయింట్ ఉంది...అదేంటంటారా?...

Recommended Video

మరో చరిత్ర సృష్టించనున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర

వీళ్లందరూ సీరియస్ టైప్ స్పీకర్లే...తాము చెప్పాలనుకున్నది ఊకదంపుడుగా చెబుతూ పోవడమే వీరి ప్రసంగం స్టయిల్. అయితే నవ్వుతూ...నవ్విస్తూ...వ్యంగోక్తులు విసురుతూ తాము చెప్పాలనుకున్నది చెప్పే ప్రసంగీకులే జనాలను బాగా ఆకట్టుకోగలరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా దేనికంటే... తన స్పీచ్ లో చంద్రబాబు ప్రస్తావన రాగానే కొట్టండి...చంపండి...ఉరితీయండి...అని విరుచుకు పడే ప్రతిపక్షనేత జగన్ కూడా ఇప్పుడు తన ప్రసంగం స్టయిల్ ను మార్చారు. తద్వారా జనాల నుంచి మరింత స్పందన రాబట్టుకుంటున్నారు. మరింత వివరంగా చెప్పాలంటే...

నర్సాపురంలో...జగన్ లో మరో కోణం

నర్సాపురంలో...జగన్ లో మరో కోణం

ఎప్పుడు చూసినా సీరియస్ ఫేసుతో...కొంకచో పలకరింపు నవ్వుతో తప్ప ప్రతిపక్ష నేత జగన్ ను నవ్వుతూ...నవిస్తున్న ధోరణితో సాధారణ జనాలు చూసింది అతి తక్కువేనని చెప్పుకోవచ్చు. అయితే జగన్ లో అలాంటి అరుదైన కోణాన్ని నర్సాపురం వాసులు బుధవారం ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా చూశారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆవేశంతో ప్రత్యర్థులపై విరుచుకు పడే తన సహజ శైలికి విరుద్దంగా జగన్ ఇక్కడ హాస్యోక్తులు...వ్యంగాస్త్రాలతో ప్రసంగం చేసి జనాల నుంచి అనూహ్య స్పందన రాబట్టారు.

జగన్...ఏమన్నారంటే?

జగన్...ఏమన్నారంటే?

టిడిపి మహానాడు జరిగిన తీరు గురించి జగన్ తన ప్రసంగంలో వివరిస్తూ ..."విజయవాడలో 3రోజుల పాటు అంతర్జాతీయ అబద్ధాలు-మోసాల పోటీలు ముగిశాయి. దాని పేరు మహానాడు. అబద్ధాలు, మోసాలు, దగా, కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు లాంటి అంశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీ అది. ఆ పోటీలో వరుసగా 24వ సారి నంబర్ వన్ గా గెలిచారు చంద్రబాబు. 1995నుంచి 2018వరకు ప్రతి పోటీలో ఆయనదే గెలుపు. ఈ విజయాలతో తనకున్న 'తుప్పు' అనే పేరును నిలుపుకున్నారు."
ఇలా చంద్రబాబును తుప్పుతో పోల్చారు జగన్. కేవలం తనను తిట్టడానికి మహానాడు పెట్టినట్టు కనిపిస్తోందని సెటైర్లు వేసిన జగన్..."ఇవే అంతర్జాతీయ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి నారా లోకేష్. అబద్ధాలు, మోసాలు, దగా, కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు లాంటి అంశాల్లో ఈమధ్య బాగా రాటుదేలిన వ్యక్తి నారా లోకేష్. రెండో స్థానంతో తనకున్న బిరుదు నిలబెట్టుకున్నారంటూ...ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేసి ఆ బిరుదేంటో మీ అందరికీ బాగా తెలుసు చెప్పండి"...అని ప్రశ్నించారు.

తుప్పు...పప్పు:ఏమీచేయలేరు

తుప్పు...పప్పు:ఏమీచేయలేరు

అలా లోకేష్ తనకున్న 'పప్పు' అనే బిరుదును నిలబెట్టుకున్నాడని వాక్యం పూర్తి చేశారు. ఇలాంటి తుప్పు-పప్పులు ఎంతమంది కలిసినా తనను ఏమీ చేయలేరన్నారు జగన్....ప్రతి వ్యాక్యానికి రెండు అబద్ధాలు ఆడటంలో పీజీ చేసిన వారికి మహానాడు వేదికపై మైకిచ్చి మాట్లాడించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు కుర్చీని లాక్కున్నాడు. పార్టీని లాక్కున్నాడు. ట్రస్తును, జెండాను లాక్కున్నాడు. చివరకు ఆయన చావుకూ కారణమయ్యాడు. ఇలాంటి వ్యక్తి ఎన్టీఆర్‌ ఫొటోకు దండేస్తాడు...అని జగన్ ఎద్దేవా చేశాడు...."ప్రతి ఒక్కడు వస్తాడు, మైక్ పట్టుకుంటాడు, జగన్ ను నాలుగు తిట్లు తిడతాడు పోతాడు. దీని కోసమా మహానాడు పెట్టింది. నన్ను తిట్టడం కోసం అంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. అదేదో ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి, నలుగురు కలిసి నన్ను తిట్టి, వాళ్ల మీడియాలో చూపించుకుంటే సరిపోయేది కదా."...అని జగన్ వ్యంగాస్త్రాలు సంధించారు.

ఇటీవల...మారుతున్న ధోరణి...

ఇటీవల...మారుతున్న ధోరణి...

వైసిపి అధినేత జగన్ ప్రసంగాల తీరు చూస్తే క్రమంగా మార్పు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎప్పుడూ సీరియస్ టైప్ ప్రసంగాలతో విరుచుకుపడే పవన్ ఇటీవలి కాలంలో తన స్పీచ్ ల స్టయిల్ మారుస్తున్న విషయం అర్థమవుతోందన్నారు. ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోవాలంటే సమయస్పూర్తితో కూడిన చతుర సంభాషణ ఎక్కువ ప్రభావాన్ని చూపుతోందని, ఈ విషయం జగన్ తనంతట తానుగా తెలుసుకోవడమో...లేక ఎవరైనా సలహా ఇవ్వడమో చేసి ఉంటారని...ఆ ప్రకారం జగన్ తన ప్రసంగం తీరు మార్చుకోని ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే వైసిపి అభిమానులు మాత్రం మహానాడులో నర్సిరెడ్డి అనే నేత తమ పార్టీ అధినేతను ఎద్దేవా చేసినందుకు టిట్ ఫర్ టాట్ లా జగన్ భలే రిటార్డ్ ఇచ్చారని సంబరపడుతున్నారు.

English summary
West Godavari:AP Political observers say's that Jagan has made changes in his speech. Jagan's Narsapur speech is a example for that, they added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X