విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

48 గంటల్లో అల్పపీడనం: 19కి వాయుగుండంగా మార్పు

మరోసారి తుఫాను బీభత్సం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మరోసారి తుఫాను బీభత్సం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల చెదురుమదురుగా వర్షం కురుస్తోందని.. బుధవారం నుంచి వర్ష ప్రభావం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Changes in Bay of Bengal to send forth strong winds

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు. అక్టోబర్ 19వ తేదీకి ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది వాయువ్య దిశగా పయనించి ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకుతుందని పేర్కొంది.

English summary
The Met Department predicts that the low pressure area in the Bay of Bengal to the North-east of the country is likely to develop further in to a depression and move away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X