హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిలో ప్రభుత్వం!: తెలంగాణభవన్లో మార్పు, ఛానల్ కూడా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ రూపురేఖలు త్వరలో మారనున్నాయి. ఫలితాల అనంతరం తమ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని, అధికారం తమదేనని చెబుతున్న తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు... ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో సౌకర్యాలు పెంచడంపై దృష్టి సారించారు.

ఇప్పుడున్న ప్రధాన భవనం కాకుండా అదనంగా మరో భవనం నిర్మించటానికి కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు కెసిఆర్ శనివారం పార్టీ నేతలు హరీశ్ రావు, నాయిని నర్సింహా రెడ్డి, మధుసూదనా చారి, జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులతో కలిసి తెలంగాణ భవన్ ప్రాంగణాన్ని పరిశీలించారు.

Changes in Telangana Bhavan

ఇప్పుడున్న సమావేశ మందిరంలో కార్పొరేట్ కార్యాలయం తరహాలో క్యాబిన్లు, డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పార్టీలోని అన్ని అనుబంధ సంఘాలు, విభాగాలను బలోపేతం చేసి, ఒక్కో విభాగానికి ఒక్కో క్యాబిన్ అప్పగించాలనుకున్నారు.

వివిధ రంగాలకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా చిటికెలో సమకూర్చేలా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగానికి రూపకల్పన చేయాలనుకున్నారు. తర్వాత ప్రధాన భవనం పక్కన లోగడ క్యాంటీన్ నిర్వహించిన గదుల స్థానంలో మరో పెద్ద భవనం నిర్మించాలని నిర్ణయించారు.

పార్కింగ్ కోసం ఈ భవనం సెల్లార్‌ను వదిలేసి, పైన పెద్ద సమావేశ మందిరాన్ని, పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండే విధంగా వంట గదితోసహా క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలకు గదులు పెంచనున్నారు. పార్టీ కార్యాలయం లోపల పొలిట్ బ్యూరో సభ్యులకు ప్రత్యేకంగా ఓ గది, మీడియాకు మరో గది ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న న్యూస్ ఛానల్ కార్యాలయా్ని కూడా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

English summary
Changes in Telangana Rastra Samithi's Telangana Bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X