వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ లో మారుతున్న స‌మీక‌ర‌ణాలు..! సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో అనూహ్య మార్పులు..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఏపీ లో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్య‌లో చాలా వ‌ర‌కు సిట్టింగ్ అభ్య‌ర్థు స్థానాల్లో మార్పులు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల‌తో పాటు ఎంపీ స్థానాల్లో కూడా అన్ని పార్టీల నుండి అభ్య‌ర్థులు మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా అదికార పార్టీ నుండి ఈ మార్పులు ఎక్కువ‌గా చోటుచేసుకునే అవ‌కాశాలు క‌నిపిన్నాయి. వ‌యో భారంతో కొంద‌రు, శాస‌న స‌భ‌కు పోటీచేయాల‌ని కొంద‌రు అభ్య‌ర్థులు ఉవ్విళ్ళూరుతుండ‌డంతో టీడిపిలో చాలా వ‌ర‌కు సిట్టింగ్ ఎంపీల్లో కొత్త ముఖాలు రంగంలోకి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదికార‌ పార్టీ నుండి వ‌ల‌స‌లు జోరుగా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో కొత్త అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దించేందుకు పార్టీ అదినాయ‌కత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది.

ఏపీలో సిట్టింగ్ ఎంపీల‌కు చెక్..! కొత్త వారికే చోటు..!!

ఏపీలో సిట్టింగ్ ఎంపీల‌కు చెక్..! కొత్త వారికే చోటు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చాలామంది ఎంపీలు తిరిగి పోటీ చేసే విష‌యంలో సందిగ్దం నెల‌కొంది. ముఖ్యంగా అధికార టీడీపీలో ఈ విష‌యంపై గంద‌ర‌గోళం నెల‌కొంది. ఎక్కువ‌గా ఎంపీలు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాల���ని భావిస్తున్నారు. కొత్త అభ్య‌ర్థులను వెతుక్కోవాల్సి వ‌స్తోంది. ఇప్ప‌టికే అనంత‌పురం ఎంపీగా ఉన్న జేసీ దివాక‌ర్‌రెడ్డి పోటీ నుంచి వైదులుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయ‌న స్థానంలో త‌న త‌మ్ముడు లేదా కుమారుడికి టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు.

పార్టీ మారుతున్న నేత‌లు..! అనూహ్యంగా మారుతున్న స‌మీక‌ర‌ణాలు..!!

పార్టీ మారుతున్న నేత‌లు..! అనూహ్యంగా మారుతున్న స‌మీక‌ర‌ణాలు..!!

క‌ర్నూలు ఎంపీగా ఉన్న బుట్���ా రేణుక వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. ఆమె చేరేప్పుడు టికెట్‌పై చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌న్న ప్ర‌చారం ఉంది. అయితే.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌రెడ్డి టీడీపీలో చేరే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఆయ‌న చేరితే క‌ర్నూలు ఎంపీ టికెట్ కోట్ల‌కు కేటాయించి బుట్టా రేణుక‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఈ ప‌రిణామం చోటుచేసుకుంటే రేణుక పోటీ చేయ‌డం దాదాపు క‌ష్ట‌మే.

వ‌యో భారంతో త‌ప్పుకోనున్న సిట్టింగుల‌కు..! యువ నేత‌ల కోసం వేట‌..!!

వ‌యో భారంతో త‌ప్పుకోనున్న సిట్టింగుల‌కు..! యువ నేత‌ల కోసం వేట‌..!!

ఇక అనకాప‌ల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీ‌నివాస్ ప్ర‌తి ప‌క్ష వైసీపిలో చేరిపోయారు. అన‌కాప‌ల్లి ఎంపీ సీటు కోసం టీడిపి అదిష్టానం కొత్త అభ్య‌ర్థి కోసం వేట మొద‌లు పెట్టింది. పార్టీ మారినా ఈ సారి ఆయ‌న శాస‌న స‌భ‌కు పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో అన‌కాప‌ల్లిలో టీడిపి ఎంపి అభ్య‌ర్థి ఎవ‌రైనా ప్ర‌త్య‌ర్థి పార్టీ నుండి పెద్ద‌గా పోటీ ఉండ‌ద‌నే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. మ‌చిలీప‌ట్నం ఎంపీగా కొన‌క‌ళ్ల నారాయ‌ణ రెండు ప‌ర్యాయాలు గెలిచారు. ఆయ‌న ఈసారి పెడన అసెంబ్లీ నుంచి పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు అయిష్ట‌త చూపుతున్నారు.

కొన్ని చోట్ల వార‌సులు రంగంలోకి..! ఏర్పాట్ల‌లో ఉన్న సీనియ‌ర్ నేత‌లు..!!

కొన్ని చోట్ల వార‌సులు రంగంలోకి..! ఏర్పాట్ల‌లో ఉన్న సీనియ‌ర్ నేత‌లు..!!

చంద్ర‌బాబు కూడా మచిలీ ప‌ట్నం నుంచి కొత్త వ్య‌క్తిని బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్నా���ు. కొన‌క‌ళ్ల పోటీలో ఉండ‌టంలేదు. కాకినాడ ఎంపీగా ఉన్న తోట త్రిమూర్తులుది అదే ప‌రిస్థితి. ఒక‌వైపు పోటీ చేయాల‌ని అధిష్ఠానం నుంచి ఒత్తిడి ఉన్న‌ప్ప‌టికీ తిరిగి పోటీ చేస్తారా, లేదా అన్న‌ది సందిగ్ధంగా మారింది. అలాగే న‌ర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కూడా పోటీ చేయ‌డం అనుమానంగా మారింది. దీంతో చాలా వ‌ర‌కు సిట్టింగ్ ఎంపీలు అవ‌కాశం కోల్పోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రానున్న ఎన్నిక‌లు కూడా ఎంతో ర‌స‌వ‌త్తంగా కొన‌సాగే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు.

English summary
Most of the seats in sitting postures are likely to take place in the backdrop of changing political developments in AP. The MLAs, along with MPs, are also likely to change their candidates from all parties. Particularly, these changes from the party are likely to be high.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X