వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలెం వోల్వో బస్సు ప్రమాదం: ఛార్జీషీట్లో జెసి భార్య పేరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Charge sheet on Volvo bus accident
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటన పైన సిఐడి పోలీసులు కేంద్రానికి 400 పేజీల నివేదికను సమర్పించారు. బస్సు ప్రమాదానికి పలు కారణాలని అందులో పొందుపర్చారు. ఛార్జీషీటులో జెసి ప్రభాకర్ రెడ్డి సతీమణి పేరును కూడా చేర్చారు.

వోల్వో బస్సుల తయారీలోనే లోపాలున్నాయని ఈ నివేదికలో సిఐడి పేర్కొంది. నిబంధనలను విరుద్ధంగా బస్సులో సీట్లను మార్చారని రిపోర్టులో పేర్కొంది. టైర్లకు సమీపంలోనే ఇంధన ట్యాంకులు ఉండటం వల్లే మంటలు త్వరగా వ్యాపించాయని నిర్థారించింది.

ఈ డీజిల్ ట్యాంక్ కూడా ఘోర ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ లోపం, సీట్లు పెంచడం, బస్సులో ఓవర్ లోడ్ లగేజీ, ప్రమాదకర వస్తువులు తదితరాలు ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. ఛార్జీషీటులో ఆర్ అండ్ బి అధికారులు, జబ్బార్ ట్రావెల్స్, జెసి సతీమణి పేరును చేర్చారు.

కాగా, వోల్వో బస్సు ప్రమాదం కేసులో జెసి ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమా రెడ్డినిని సిఐడి పోలీసులు గత ఫిబ్రవరి నెలలో అరెస్టు చేసి అనంతరం బెయిల్ పైన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్టు చేసి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి న్యాయస్థానంలో ఆమెను హాజరుపర్చారు. కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. పాలెం దుర్ఘటన జరిగిన బస్సు జెసి ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమారెడ్డి పేరు మీద ఉంది.

English summary
CID submits Charge sheet on Volvo bus Palem accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X