వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17 మంది యువతులు, ఫేక్ ఐడీలతో అకౌంట్లు, వీడియోలు చూపి.. బ్లాక్ మెయిల్, అరెస్ట్

|
Google Oneindia TeluguNews

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లతో యువతకులకు వలపువల వేసిన కేటుగాడి ఆటను పోలీసులు కట్టించారు. ఫేక్ ఐడీలతో యువతులను ట్రాప్‌లో వేసినవాడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి వివరాలను రాబడుతున్నారు. ఇప్పటివరకు 17 మంది మహిళలపై అఘాయిత్యానికి తెగబడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని చెప్పారు.

 స్పందనతో వెలుగులోకి..

స్పందనతో వెలుగులోకి..

ఇటీవల విశాఖపట్టణంలో పోలీసు కమిషనర్ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో ఓ యువతి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. దీంతో ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అని విచారిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఒకరినే కాదు పదుల సంఖ్యలో యువతిని మోసం చేసినట్టు గుర్తించారు. వారితో కనెక్ట్ అయ్యేందుకు అతగాడు ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్‌ను సాధనంగా వాడుకొన్నారని తెలిపారు.

క్యాబ్ డ్రైవరే..

క్యాబ్ డ్రైవరే..

విశాఖపట్టణానికి చెందిన యువకుడు క్యాబ్ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. అతని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. నకిలీ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేసి యువతులను మచ్చిక చేసుకుంటాడని విచారణలో తేలింది. అలా స్నేహం ప్రేమకు.. ప్రేమ కలుసుకొనేవరకు వెళుతుంది. అలా ఒకరినొకరు మనసిచ్చుకొని.. అతగాడిని విశ్వసించి మోస పోయారని పోలీసులు తెలిపారు.

 17 ఫేక్ అకౌంట్లు

17 ఫేక్ అకౌంట్లు

మోసగాడు వ్యవహారం ఇటీవల స్పందన కార్యక్రమంలో యువతి ఫిర్యాదు చేయడంతోనే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలా విచారిస్తే డొంక కదిలింది. ఆమెతోపాటు దాదాపు 17 మంది మహిళలను ఫేక్ అకౌంట్‌తో ట్రాప్ చేశాడని పేర్కొన్నారు. ఇందుకోసం కేటుగాడు సోషల్ మీడియా వాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. యువతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విశాఖ సీపీ తెలిపారు.

బ్లాక్‌మెయిల్..

బ్లాక్‌మెయిల్..

యువతులను ప్రేమ మైకంలో ముంచాక.. తన పని కానిస్తున్నాడు. దీంతోపాటు వారిని బెదిరించేందుకు చావు తెలివితేటలు కూడా చూపిస్తున్నాడు. ఇదివరకు ఏకాంతంగా ఉన్న ఫోటోలు, వీడియోలను అస్త్రంగా మార్చుకుంటున్నాడు. అవి యువతులకు చూపిస్తూ బెదిరిస్తున్నాడు. వారి వద్ద నుంచి నగదు, బంగారం తీసుకుంటున్నాడు. అతనిని నిలదీసే ధైర్యం లేక.. యువతులు నగదు, నగలు ఇచ్చేస్తున్నారు.

ఇంకా ఎవరైనా.

ఇంకా ఎవరైనా.

ఆ కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వలలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా ? నగదు, నగలు ఎన్ని తీసుకున్నారు అనే అంశాలను త్వరలో వెల్లడిస్తామని విశాఖ సీపీ తెలిపారు. నిందితుడి వివరాలను కూడా మీడియా సమావేశంలో తెలియజేస్తామని పేర్కొన్నారు.

English summary
some one cheat to girls. he used to facebook fake account for chatting. after that he take vedios and blackmail girls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X