వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నాని ఫేక్‌ లెటర్‌తో 3.3 లక్షలకు టోపీ- పౌరసరఫరాలశాఖలో డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో..

|
Google Oneindia TeluguNews

ఏపీలో నకిలీ లేఖల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో పలువురు మంత్రులు, అధికారుల పేరుతో నకిలీ లేఖలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతుండగా.. తాజాగా ఇదే కోవలో పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పేరుతోనూ నిందితులు మోసానికి పాల్పడ్డారు. పౌరసరఫరాలశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.3.3 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ సృష్టించి ఉద్యోగం వచ్చినట్లు నమ్మించారు. మోసం బయటపడటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

కొడాలి 100 తప్పలు కాస్తాం: జీవీఎల్ -జెరుసలేంకు భార్యతోనే వెళ్లారుగా: స్వామి -నాని కన్నీటిపర్యంతంకొడాలి 100 తప్పలు కాస్తాం: జీవీఎల్ -జెరుసలేంకు భార్యతోనే వెళ్లారుగా: స్వామి -నాని కన్నీటిపర్యంతం

పౌరసరఫరాల శాఖ పరిధిలోకి వచ్చే సివిల్‌ సప్లైస్‌ అండ్ కన్సూమర్‌ అఫైర్స్‌ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఎగయ్య అనే యువకుడిని మోసం చేశారు. అతని నుంచి 3.3 లక్షలు తీసుకుని మంత్రి కొడాలి నాని ఓఎస్టీ పేరుతో ఓ నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ సృష్టించారు. ఇందుల సంతకాలు, స్టాంపులు ఫోర్జరీ చేశారు. చివరికి సదరు యువకుడు అపాయింట్‌మెంట్‌ లేటర్ తీసుకుని ఆఫీసుకు వెళ్తే వీళ్ల బండారం బయటపడింది. దీంతో బాధితుడు ఎగయ్య తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

cheating worth 3.3 lakhs with ap minister kodali nanis fake appointment letter

ఈ వ్యవహారంలో అదే శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న సతీష్‌ వర్మతో పాటు గుంటూరులోని వార్డు సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న సౌజన్య అనే యువతి, మరో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు. సివిల్ సప్లై అధికారికి నకిలీ పత్రాలు పంపిన సతీష్ వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్లూరు పోలీసులు ప్రకటించారు.

Recommended Video

#YSRJalaKala: Free Borewells To Farmers Scheme Launched By AP CM YS Jagan || Oneindia Telugu
cheating worth 3.3 lakhs with ap minister kodali nanis fake appointment letter
English summary
thullur police have filed 3.3 laksh worth cheating case of fake appointment done by attender satish varma creating letter on the name of ap civil supplies minister kodali nani's osd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X