వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీఏ లో అవినీతి అనకొండలకు చెక్..! కొరఢా ఝుళిపిస్తున్న కమీషన్ ఆంజనేయులు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపిలో అవినీత రహిత పాలన అందిస్తామని, అవినీతికి ఎవరు పాల్పడినా ఉపేక్షించమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు అనుగుణంగా అదికారులు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతికి ఎక్కువ అవకాశం ఉండే ఆర్టీఏ శాఖలో ప్రక్షాళనకు ఆ శాఖ కమీషనర్ పీఎస్సార్ ఆంజనేయులు నడుంబిగించారు.

అవినీతి ఏరులై పారుతున్న చోట ఆంజనేయులు లాంటి అదికారి అవపరం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. లంచాలతో బదిలీలను ఆపుకుంటూ ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసుకుని కూర్చున్న అదికారులకు చుక్కులు చూపిస్తున్నారు ఏపి ఆర్టీఏ కమీషనర్ పీఎస్సార్ ఆంజనేయులు.

నీవు హీరోవా..బాహుబ‌లివా: స‌భ‌లో చ‌ంద్ర‌బాబు..బోయ‌పాటిపై ఫైర్‌: పుష్క‌రాల తొక్కిస‌లాటపై విచార‌ణ‌..! <br>నీవు హీరోవా..బాహుబ‌లివా: స‌భ‌లో చ‌ంద్ర‌బాబు..బోయ‌పాటిపై ఫైర్‌: పుష్క‌రాల తొక్కిస‌లాటపై విచార‌ణ‌..!

సీఎం బాటలోనే అదికారులు..! అవినీతి రహిత సమాజం కోసం వినూత్న ప్రయత్నాలు..!!

సీఎం బాటలోనే అదికారులు..! అవినీతి రహిత సమాజం కోసం వినూత్న ప్రయత్నాలు..!!

బదిలీల కోసం లంచాలంటూ ఉద్యోగులను వేధిస్తే తాటా తీస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్టీఎ కమీషనర్ పీఎస్సార్ ఆంజనేయులు రవాణా శాఖ లోని అవినీతిపరులకు ఇచ్చిన వార్నింగ్ వీడియోనెట్టింట హల్ చల్ చేస్తోంది. గత ప్రభుత్వం హయాం లో ఆర్టీఎ శాఖ లో జరిగిన అవినీతి పర్వాలపై ఇప్పటి కే కొరడ ఝళిపిస్తోన్న ఈ ఐపీఎస్ అధికారి తాజా వీడియో, రవాణా శాఖ లోపాతుకుపోయిన అవినీతి అనకొండలకు దడపుట్టిస్తోంది.

రవాణా శాఖ ప్రక్షాళన..! లంచావతారులకు బ్రేకులు వేస్తున్న కమీషనర్..!!

రవాణా శాఖ ప్రక్షాళన..! లంచావతారులకు బ్రేకులు వేస్తున్న కమీషనర్..!!

2015 నుండి బదిలీలు కాకుండా లంచాలిచ్చి అప్పటి రవాణాశాఖ కమీషనర్ ఫ్రీ హ్యాండ్ తో ఆమ్యామ్యాలకు ఇష్ఠ్యా రాజ్యంగా మారిన ఆర్టీఎ డిపార్ట్మెంట్ లో ఇప్పటి కే అవినీతి అధికారుల దుమ్ముదులుపుతున్న రవాణా శాఖ కమీషనర్ తాజా వీడియో సమావేశాల్లో డిప్యూటీ ఆర్టీఏ అధికారులకు, మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్లుకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఏపిలో కొత్తగా ఏర్పడ్డ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి, పారదర్శకత లో భాగంగా కఠినంగా వుండాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అవినీతి అధికారులను ఉపేక్షించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో సీఎం ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూన్నారు రవాణా శాఖ ఉన్నతాధికారులు.

ఆర్టీఏలో అదికారుల చేతి వాటం..! ఇక ఆటలు సాగవంటున్న కమీషన్ ఆంజనేయులు..!!

ఆర్టీఏలో అదికారుల చేతి వాటం..! ఇక ఆటలు సాగవంటున్న కమీషన్ ఆంజనేయులు..!!

శాఖలోని అధికారులు బదిలీలకోసం ఉద్యోగుల నుండి లంచాలు వసూలు చేస్తున్నారనే సమాచారం ఆయనకు రావడంతో బదిలీల్లో అక్రమాలకు పాల్పడుతున్న అనకొండలతో ప్రత్యేకమీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ల నుండి డిప్యూటీ కమీషనర్ రేంజ్ స్థాయి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడుసామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లంచాలు, రికెమెండెషన్ లు లేని వారికే మొదటి ప్రియారిటీ అన్న కోటాలో తాజా బదిలీలు రవాణ శాఖలో తొలిసారిగా జరిగాయని ఆర్టీఎ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

నిజాయితీగా ఉండకపోతే కఠిన చర్యలే..! సీరియస్ యాక్షన్ అంటున్న సిన్సియర్ ఆఫీసర్..!!

నిజాయితీగా ఉండకపోతే కఠిన చర్యలే..! సీరియస్ యాక్షన్ అంటున్న సిన్సియర్ ఆఫీసర్..!!

ఆ శాఖ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న నాటినుండి ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలపై కఠిన చర్యలు, వాటితో పాటు దొంగ ఇన్ వాయిస్లతో లైఫ్ టాక్స్ఎగ్గొట్టిన డీలర్ల పై ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు కమీషనర్ పీఎస్సార్ ఆంజనేయులు. తాజా గా జరిగిన బదిలీల ప్రక్రియ లో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పారదర్శకంగా, కఠినంగా చేపట్టడంతో దాదాపు 300 మందికి పైగా ఉద్యోగులలో బదిలీలు నయాపైసా ఖర్చుకాకుండా జరిగాయని రవాణా శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు..

English summary
AP CM Jaganmohan Reddy's comments that the government is offering a non-corruption regime in the AP, and whoever is involved in the corruption seems to be on the move. Commissioner of the RTA, who is susceptible to corruption, has been instrumental in the purge of the department's Commissioner, PSR Anjaneyulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X