• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముచ్చటగా మూడేళ్లు: జనసేన 'గ్రౌండ్ రియాలిటీ'.. ఆ అపప్రద ఇంకెన్నాళ్లు?

|

విజయవాడ: క్షేత్ర స్థాయిలో జనసేన ప్రభావమెంతో తెలియదు గానీ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆ పార్టీ పేరు కూడా ప్రస్తావించాల్సిన అనివార్యత ఏర్పడింది. బలాబలాలతో సంబంధం లేకుండా వన్ ఆర్మీగానే నెట్టుకొస్తున్న పార్టీ ముచ్చటగా మూడేళ్లు పూర్తిచేసుకుంది.

జనసేన: వన్ మెన్ ఆర్మీనా? మెనీ మెన్ పార్టీనా? అసలు ఈ మూడేళ్లలో సాధించిందేమిటి?

ఈ నేపథ్యంలో సహజంగానే ఆ పార్టీ తీరుతెన్నుల గురించి చర్చ జరుగుతోంది. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ మూడేళ్లలో ఆ పార్టీ సాధించిందేంటి?.. పార్టీ పరంగా ఎంత మెరుగ్గా ఉంది?.. వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం ఎంతమేరకు వంటి ప్రశ్నలపై అటు జనంలోను, ఇటు మీడియాలోను హాట్ హాట్ చర్చ నడుస్తోంది.

అసలు పరీక్ష అదే!:

అసలు పరీక్ష అదే!:

ఒకసారి రాజకీయాల్లోకి దిగాక తమ బలమేంటో నిరూపించుకోవాలంటే ఎన్నికలను ఎదుర్కోవాల్సిందే. తానెంత ప్రజల మనిషినని చెప్పుకున్నా, రాజకీయ కుట్రలు-కుతంత్రాలు తెలియవన్నా.. ప్రజాక్షేత్రంలో పరీక్షకు నిలబడితే గానీ సత్తా నిరూపణ కాదు.

పార్టీ స్థాపించి మూడేళ్లవుతున్నా.. ఒక్క ఎన్నికను కూడా జనసేన ఎదుర్కోకపోవడం ఆ పార్టీకి ప్రతికూలమనే చెప్పాలి. క్షేత్రస్థాయిలో తమ పట్టు ఎంతనే దానిపై ఒక అంచనాకు రావాలంటే అంతకుమించిన మార్గం లేదు. ప్రస్తుతం పార్టీ అంతర్గత నిర్మాణం మీద ఫోకస్ చేసిన పవన్.. భవిష్యత్తులో ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీని ఏవిధంగా సంసిద్దం చేస్తున్నారో తెలియడం లేదు.

అప్పుడో మాట.. ఇప్పుడో మాట:

అప్పుడో మాట.. ఇప్పుడో మాట:

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేస్తుందని అప్పట్లో పవన్ ప్రకటించారు. కానీ ఇటీవల తన సోషల్ మీడియా టీమ్ శతఘ్నితో సంభాషణ సందర్భంగా.. 2018, డిసెంబర్ వరకు దానిపై స్పష్టతనివ్వలేనన్నారు. దీంతో పవన్ మాటల్లో క్లారిటీ మిస్సయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ముందస్తు ఎన్నికలకు కూడా సిద్దమంటూ మొన్నామధ్య ట్వీట్ కూడా చేసిన పవన్.. ఇప్పుడిలా వెనక్కి తగ్గినట్లు మాట్లాడమేంటో అంతుపట్టడం లేదు.

ప్రభావం ఎంతమేర?:

ప్రభావం ఎంతమేర?:

పవన్‌కు ఉన్న అతిపెద్ద బలం ఆయన అభిమానులు. కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకు కూడా జనసేనకు కలిసొచ్చే అంశం. ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో ఆయన చూపిన చొరవ కూడా మంచి మార్కులే పడేలా చేసింది.

రాజధాని భూముల వివాదం, తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ, విద్యార్థుల సమస్యలు.. ఇలా సమస్య ఏదైనా పవన్ మీద నమ్మకంతో చాలామందే ఆయన్ను ఆశ్రయించారు. అయితే ఆయా సమస్యల పరిష్కారంలో వారికి ఎంతమేర న్యాయం జరిగిందన్నది మాత్రం క్లారిటీ లేదు.

రాబోయే రోజుల్లో వారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగే రీతిలో పవన్ వ్యవహరిస్తే పరిస్థితులు ఆయనకు మరింత అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. ఒకవేళ ఆ నమ్మకం వమ్ము అయితే మాత్రం అంతే ప్రతికూలతలు కూడా తప్పవు.

స్వీయ సమీక్ష అత్యవసరం:

స్వీయ సమీక్ష అత్యవసరం:

వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోటీ అని చెబుతున్నప్పటికీ.. అది ఎన్ని స్థానాల్లో అనే దానిపై జనసేన నుంచి క్లారిటీ లేదు. ఎన్నికలకు గట్టిగా మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండటంతో.. ఈలోగా 175స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను తయారుచేసుకునే సత్తా ఉందా? అంటే అనుమానమే.

దానికి తోడు ఎన్నికలవేళ కేవలం బలాబలాలను నమ్ముకుంటే సరిపోదు. కచ్చితమైన మేనిఫెస్టోతో బరిలో దిగాల్సి ఉంటుంది. కొత్త పార్టీ కాబట్టి పవన్ కచ్చితంగా ఇప్పటినుంచే దీనిపై కసరత్తులు మొదలుపెట్టాల్సిన అవసరముంది. జనాకర్షక పథకాలు, వారి నాడిని పట్టుకునే వ్యూహాలు రచించాలంటే బయటి వ్యక్తుల సహాయం కూడా తప్పనిసరి. కాబట్టి వీటన్నింటిపై పవన్ ఒక స్వీయ సమీక్ష చేసుకుంటే

అది పార్టీకి ఉపయోగపడుతుంది. లేదంటే ఎన్నికల్లో తేలిపోవడం ఖాయం.

ఆ అపప్రద ఎంతకాలం?:

ఆ అపప్రద ఎంతకాలం?:

టీడీపీకి పవన్‌కు మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందన్న ప్రచారం చాలానే జరుగుతోంది. సీఎం చంద్రబాబును పదేపదే వెనకేసుకురావడం, ఆయన కూడా పవన్ పట్ల సానుకూల వైఖరితోనే వ్యవహరించడం.. ఇద్దరి మధ్య ఉన్న గుట్టును బయటపెడుతుందన్న వాదన ఉంది. ఆ అపప్రదను పవన్ తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు. సొంతంగా పార్టీని నడిపే ఉద్దేశమే గనుక ఉంటే, చంద్రబాబు నామస్మరణను పవన్ మానేయడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Power Star Pawan Kalyan has completed three years journey of Political life. While addressing with the media on occasion of Jana Sena Party formation day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X