చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హేట్సప్ టు చెన్నై: వెంకయ్య, మేమున్నాం: జగన్ (చెన్నై పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/అమరావతి: చెన్నైలో భారీ వర్షాలు, వరదల పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా శుక్రవారం నాడు స్పందించారు.

వరద బాధితులను ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన అవసరముందని వెంకయ్య అన్నారు. వరదల్లో చిక్కుకున్న తోటీ వారికి చెన్నైవాసులు తమవంతు సాయం చేస్తున్నారని, ఆపన్నహస్తం అందిస్తున్న చెన్నైవాసులకు హేట్సప్ అంటూ ట్వీట్ చేశారు.

జగన్ కూడా ట్వీట్ చేశారు. వర్షాలు, వరద ముంపుతో విలవిల్లాడుతున్న ప్రజలను ప్రభుత్వాలు, ఇతరులు ఆదుకోవాలని జగన్ కోరారు. వారికి సాధ్యమైనంత మేరకు సహాయం అందించాలన్నారు. ప్రకృతి సృష్టించిన బీభత్సాన్ని చెన్నైవాసులు మనోనిబ్బరంతో ఎదుర్కొంటున్న తీరు ఆదర్శనీయమని, ఈ క్లిష్ట సమయంలో వారికి తమ సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నామన్నారు.

చెన్నై అతలాకుతలం

చెన్నై అతలాకుతలం

తమిళనాడులో శుక్రవారం కూడా వర్షం తగ్గుముఖం పట్టింది. రెండు రోజుల వరకు భారీ వర్షాలు రావని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, అంతలోనే వర్షం మళ్లీ ప్రారంభమైంది. దీంతో చెన్నైవాసులు ఆందోళన చెందారు. ఆ తర్వాత మళ్లీ వర్షం నిలిచిపోయింది.

చెన్నై అతలాకుతలం

చెన్నై అతలాకుతలం


భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నైలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు.

చెన్నై అతలాకుతలం

చెన్నై అతలాకుతలం

సహాయక చర్యల్లో పాల్గొనేందుకు మరిన్ని కేంద్ర బలగాలను రంగంలో దింపినట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో రాష్ట్రాలకు కేంద్రం బాసటగా నిలుస్తుందన్నారు.

 చెన్నై అతలాకుతలం

చెన్నై అతలాకుతలం

చెన్నై నగరం ఒక దీవిగా మారిందని చెప్పడం అతిశయోక్తి కాదని రాజ్ నాథ్ అన్నారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనిరీతిలో ఎడతెరిపిలేని వర్షాలు చెన్నైలో కురుస్తున్నాయన్నారు.

చెన్నై అతలాకుతలం

చెన్నై అతలాకుతలం

తమిళనాడును ఆదుకునేందుకు సాధ్యమైనవన్నీ చేస్తున్నామని వెంకయ్య నాయుడు చెప్పారు. సాధ్యమైనన్ని ప్రాంతాలకు కేంద్ర బలగాలు చేరుకుంటున్నాయన్నారు.

చెన్నై అతలాకుతలం

చెన్నై అతలాకుతలం


చెన్నైవాసులు, ఆరెస్సెస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్) కార్యకర్తలు, మీడియా సంస్థలు అందిస్తున్న సేవల్ని వెంకయ్యనాయుడు కొనియాడారు.

English summary
YSRCP chief YS Jagan and Union Minister Venkaiah Naidu tweets on Chennai floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X