విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్ర‌మాణ స్వీకారానికి ముందు రోజు..తీరిక లేకుండా! కనక దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన వైఎస్ జగన్

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: మ‌రి కొన్ని గంట‌ల్లో రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి ఉన్న నేప‌థ్యంలో.. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బుధ‌వారం తీరిక లేకుండా గ‌డిపారు. ఉద‌యం తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. తిరుమ‌ల నుంచి ప్ర‌త్యేక విమానంలో నేరుగా క‌డ‌ప‌కు వెళ్లారు. అక్క‌డ అమీన్ పీర్ ద‌ర్గాలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు.

క‌డ‌ప నుంచి త‌న స్వ‌స్థలం పులివెందుల‌కు వెళ్లిన వైఎస్ జ‌గ‌న్ అక్క‌డ సీఎస్ఐ చ‌ర్చిలో ప్రార్థ‌న‌లు చేశారు. పులివెందుల నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరిన ఆయ‌న సాయంత్రం గ‌న్న‌వ‌రం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి నేరుగా క‌న‌క దుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారికి ప‌ట్లు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు.

Chief Minister designated YS Jagan visits Kanaka Durga temple at Vijayawada

ఈ సంద‌ర్భంగా ఆల‌య అర్చ‌కులు వైఎస్ జ‌గ‌న్‌ను పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ఆ స‌మ‌యం జ‌గ‌న్ వెంట రాజ్య‌స‌భ స‌భ్యుడు వీ విజ‌యసాయి రెడ్డి, కొత్త‌గా గెలిచిన ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. దుర్గగుడి కార్య‌నిర్వ‌హ‌ణాధికారిణి కోటేశ్వరమ్మ, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయ‌న విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు వెళ్లారు. అక్క‌డ బ‌స చేసిన ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అనంత‌రం తాడేప‌ల్లిలోని నివాసానికి చేరుకున్నారు.

కనకదుర్గ సన్నిధికి చేరుకున్న జగన్ వెంట ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. దుర్గ దర్శనం అనంతరం జగన్ గేట్ వేలో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయి అక్కడ నుండి తాడేపల్లిలో నివాసంకు చేరుకుంటారు.

English summary
Chief Minister Designated YS Jagan Mohan Reddy visits Kanaka Durga Malleswara Swamy temple at Vijayawada on Wednesday, just before the day of His swearing ceremony organized. He offered prayers at the temple. YS Jagan visits Tirumala, Ameen Peer Dargah at Kadapa, CSI Church at Pulivendula, and Kanaka Durga Temple in a single Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X