గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలరించిన నృత్యాలు: టీచర్లకు బాబు సన్మానం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గుంటూరు: నూతన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరులో నిర్వహించిన గురుపూజోత్సవం పలు ప్రత్యేకతలకు వేదికగా నిలచింది. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో అచ్చ తెలుగు సంప్రదాయంతో నిర్వహించిన గురువుల పండుగ ఆహ్లాదకరంగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు పెద్దిరెడ్డి లక్ష్మణరెడ్డి, పి మునికృష్ణారెడ్డిలను గురుపూజోత్సవ వేళ ఘనంగా సత్కరించారు.

తమవద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న చంద్రబాబు ఇంతటి వాడయ్యాడంటూ వారు పొంగిపోయారు. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబులో చిన్ననాటి నుంచే సేవాభావం అధికంగా ఉండేదని, అప్పట్లోనే చందాలు వసూలుచేసి గ్రామంలో రోడ్డు, స్కూలు అభివృద్ధి పనులను చేపట్టాడని అన్నారు. అప్పట్లో చంద్రబాబు మంచి అందగాడని, అందుకే తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ తన అల్లుడిగా చేసుకున్నారని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు కాడిపట్టి పొలం దున్నిన రోజులు తనకు బాగా గుర్తున్నాయన్నారు.

చంద్రబాబు సైన్స్ టీచర్ మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఏదైనా పని పట్టుకుంటే దానిని సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం బాబుదని అన్నారు. గురువులిద్దరినీ దుశ్శాలువ, పుష్పగుచ్ఛాలతో సత్కరించిన బాబు చెరొక లక్ష రూపాయలను గురుపూజోత్సవ కానుకగా వేదికపైనే అందజేశారు. తన గురువులను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని, ఉన్నత స్థానాల్లోకి చేరిన బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పాలని చంద్రబాబు కోరారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పేరేడ్‌ గ్రౌండ్స్‌లో విద్యారినీ విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర అతిథులకు స్వాగతం పలుకుతూ రాధామాధవ రసరంజని ఆధ్వర్యంలో జలీల్‌ బృందం చేసిన శ్రీకృష్ణుడి బృందావన నృత్యగీతం ఆకట్టుకుంది.

చంద్రబాబు

చంద్రబాబు

నూతన ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గుంటూరులో నిర్వహించిన గురుపూజోత్సవం పలు ప్రత్యేకతలకు వేదికగా నిలచింది.

చంద్రబాబు

చంద్రబాబు

గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో అచ్చ తెలుగు సంప్రదాయంతో నిర్వహించిన గురువుల పండుగ ఆహ్లాదకరంగా సాగింది.

చంద్రబాబు

చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు పెద్దిరెడ్డి లక్ష్మణరెడ్డి, పి మునికృష్ణారెడ్డిలను గురుపూజోత్సవ వేళ ఘనంగా సత్కరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

తమవద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న చంద్రబాబు ఇంతటి వాడయ్యాడంటూ వారు పొంగిపోయారు.

చంద్రబాబు

చంద్రబాబు

లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబులో చిన్ననాటి నుంచే సేవాభావం అధికంగా ఉండేదని, అప్పట్లోనే చందాలు వసూలుచేసి గ్రామంలో రోడ్డు, స్కూలు అభివృద్ధి పనులను చేపట్టాడని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అప్పట్లో చంద్రబాబు మంచి అందగాడని, అందుకే తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ తన అల్లుడిగా చేసుకున్నారని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు కాడిపట్టి పొలం దున్నిన రోజులు తనకు బాగా గుర్తున్నాయన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు సైన్స్ టీచర్ మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఏదైనా పని పట్టుకుంటే దానిని సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం బాబుదని అన్నారు. గురువులిద్దరినీ దుశ్శాలువ, పుష్పగుచ్ఛాలతో సత్కరించిన బాబు చెరొక లక్ష రూపాయలను గురుపూజోత్సవ కానుకగా వేదికపైనే అందజేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

తన గురువులను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని, ఉన్నత స్థానాల్లోకి చేరిన బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పాలని చంద్రబాబు కోరారు.

చంద్రబాబు

చంద్రబాబు

విజయవాడ మాంటిస్సోరి స్కూల్‌ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మల్లి డ్యాన్స్‌ అకాడమి(గుంటూరు), బిషప్‌ అజ్రీన్‌ స్కూల్‌(విజయవాడ) విద్యార్థుల నృత్యాలు ఆకట్టకున్నాయి.

చంద్రబాబు

చంద్రబాబు

విజయవాడకే చెందిన పిఎస్‌ఎం విద్యా సంస్థలకు చెందిన విద్యార్ధులు ప్రదర్శించిన యోగా నృత్యం సందేశాత్మకంగా సాగింది.

చంద్రబాబు

చంద్రబాబు

ఉదయం 10 గంటలకే గుంటూరు, విజయవాడల్లోని విద్యా సంస్థలకు చెందిన దాదాపు 50 మందికిపైగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు వచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా ప్రదర్శనలు చేసిన విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

English summary

 Chief Minister N. Chandrababu Naidu honoured two of his school teachers during the Teacher’s Day celebrations. The teachers-- Peddireddy Lakshmana Reddy and P. Munikrishna Reddy had taught Social Studies and Science to Mr. Naidu, at the ZP High School at Chandragiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X