వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్ జెఠ్మలానీ కన్నుమూత పట్ల ప్రముఖుల సంతాపం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీమంత్రి రామ్ జెఠ్మలానీ కన్నుమూత పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం వారు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ట్వీట్ల ద్వారా తమ సంతాప సందేశాన్ని వెల్లడించారు. రామ్ జెఠ్మలానీ మృతితో దేశం.. ఓ న్యాయ కోవిదుడిని కోల్పోయిందని అన్నారు. దేశ న్యాయ చరిత్రలో జెఠ్మలానీ. శిఖరం లాంటి వారని చెప్పారు.

రామ్ జెఠ్మలానీ మరణంతో దేశం ఓ గొప్ప పోరాట యోధుడిని కోల్పోయిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ప్రజా సంబంధ వ్యవహారాలు, ప్రజల హక్కులు, న్యాయ అంశాలను పరిరక్షించడానికి రామ్ జెఠ్మలానీ చివరి వరకూ పోరాడారని అన్నారు.న్యాయ రంగానికి ఓ ఐకన్ గా మిగిలారని చెప్పారు. రామ్ జెఠ్మలానీతో తాను కలిసి ఉన్న ఫొటోను జత చేసిన నరేంద్ర మోడీ.. దాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ వరుసగా ట్వీట్లను సంధించారు. ఎలాంటి భయాలు, సంకోచాలు లేకుండా కీలక కేసులను వాదించారని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. న్యాయాన్ని పరిరక్షించడానికి అహర్నిశలు కృషి చేశారని చెప్పారు.ఇందిరాగాంధీ హయాంలో అత్యయిక పరిస్థితిని ప్రకటించిన సమయంలో రామ్ జెఠ్మలానీ చూపించిన అసమాన తెగువ ప్రదర్శించారని, కేంద్రానికి ఎదురొడ్డి నిలిచారని అన్నారు.

Chief Minister of AP YS Jagan and former CM Chandrababu expresses condolences to Jethmalani

రామ్ జెఠ్మలానీ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆయన మరణం దేశ న్యాయ రంగానికి తీరని లోటుగా వారు అభివర్ణవంచారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. న్యాయబద్ధంగా, చట్టానికి లోబడి రామ్ జెఠ్మలానీ ఎన్నో కేసులను వాదించారని, వాటిల్లో నూరుశాతం విజయాలను సాధించడం అద్భుతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నూరుశాతం విజయాలను సాధించిన అరుదైన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారని చెప్పారు. న్యాయ శిఖరం నేలకొరిగిందని, ఆయన మరణం.. న్యాయ వ్యవస్థకు తీరనిలోటుగా చెప్పారు. రామ్ జెఠ్మలానీ ఓ అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు.

English summary
Leaders across party lines condoled the death of veteran lawyer and former Union minister Ram Jethmalani after his demise following prolonged illness. Prime Minister Narendra Modi said that India has lost an exceptional lawyer. In a series of tweet, Prime Minister wrote, “In the passing away of Shri Ram Jethmalani Ji, India has lost an exceptional lawyer and iconic public figure who made rich contributions both in the Court and Parliament. He was witty, courageous and never shied away from boldly expressing himself on any subject.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X