విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వైరస్ టెస్ట్ కిట్స్..మేడిన్ ఏపీ: త్వరలో తొలి కిట్: భారీగా కమర్షియల్ ఆర్డర్లు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కరోనా వైరస్ లక్షణాలను గుర్తించడానికి ఉద్దేశించిన టెస్ట్ కిట్స్ మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఈ కిట్స్‌ను ఆవిష్కరించనున్నారు. విశాఖపట్నంలోని మెడ్‌టెక్ జోన్‌లో కరోనా కిట్స్ తయారీని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆరంభించింది. ప్రస్తుతం ఈ కిట్స్ తయారీ ఊపందుకున్నాయని. మరో 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 19వ తేదీన తొలి కిట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించే అవకాశం ఉంది.

లాక్‌డౌన్ పొడిగింపు: రాష్ట్రాల ప్రతిపాదనలను ఆమోదించే దిశగా కేంద్రం యోచన.. లీకులులాక్‌డౌన్ పొడిగింపు: రాష్ట్రాల ప్రతిపాదనలను ఆమోదించే దిశగా కేంద్రం యోచన.. లీకులు

రాష్ట్ర అవసరాల కోసం ప్రస్తుత వాటి తయారీ కొనసాగుతోందని, వచ్చే వారం నుంచి కమర్షియల్ ప్రొడక్షన్‌ను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. టెస్ట్ కిట్స్‌తో పాటు వెంటిలేటర్లను కూడా పెద్ద సంఖ్యలో తయారు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇదివరకే 30 కోట్ రూపాయలను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన సాంకేతికత, మార్గనిర్దేశకాల ఆధారంగా టెస్టింగ్, డయాగ్నసిస్ ఎక్విప్‌మెంట్‌ను రూపొందిస్తున్నాయి ఆ కంపెనీలు.

Chief Minister YS Jagan to launch first made in Andhra Pradesh Covid-19 test kit soon

Recommended Video

AP CM Jagan, CM KCR And Chandrababu Naidu Light Candles, Diyas

విశాఖపట్నానికే చెందిన ఏఎంటీజెడ్ మెడికల్ సర్వీసెస్ సంస్థ ఇప్పటికే 3500ల కరోనా కిట్స్‌ను ఆర్డర్ ఇచ్చింది. వెంటిలేటర్లను కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయబోతోంది. ప్రతినెలా ఆరువేల వెంటిలేటర్లను కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్డర్ ఏఎంటీజెడ్ నుంచి అందినట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ టెస్టింగ్ కిట్స్, వెంటిలేటర్లను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలించాల్సి ఉంటుందని, దాని తరువాతే వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy is all set to launch the first made in AP Covid 19 Coronavirus test kit soon. The commercial production of the test kits will be commenced in the next week, Along with the ventilators also will be produced at the Med Tech Zone in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X