వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిలో చిలకలూరిపేట నంబర్ వన్:వైఎస్ జగన్

|
Google Oneindia TeluguNews

చిలకలూరిపేట :రాష్ట్రంలో జరగుతున్నఅవినీతి, అక్రమాలు, దారుణాలు, వేధింపులు వీటన్నింటిలో చిలకలూరిపేట మొదటి స్థానంలో ఉందని వైసిపి అధినేత జగన్ విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 117వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఇదే నియోజకవర్గంలో పత్తిని దళారుల నుంచి రాష్ట్రంలో మంత్రులు ఎలా కొన్నారో అందరం చూశారని, పత్తిలో దాదాపుగా రూ. 650 కోట్ల స్కాం జరిగింది. ఈ భారీ స్కాం చిలకలూరిపేట నుంచే మొదలైందని జగన్ ఆరోపించారు. "మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతిపక్ష నేతగా నేనొచ్చి ధర్నాలు, నిరాహార దీక్ష చేస్తే తప్ప స్పందన లేదు. మినుములు, పెసలు, మొక్కజొన్న, శెనగ, కంది ఇలా ఏ పంటను చూసిన రైతన్న ముఖంలో కన్నీరే కనిపిస్తోంది"...అని జగన్ విమర్శల వర్షం కురిపించారు.

Chilakaluripet is number on in corruption:YS Jagan

చిలకలూరిపేట నియోజకవర్గం, గుంటూరు జిల్లాలు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులకు అడ్డగా మారాయి. సాక్షాత్తు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇందులో భాగం ఉంది. వైఎస్‌ఆర్‌ హయాంలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని 1200 మందికి 52 వేల ఎకరాలు సేకరించి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇవాళ చంద్రబాబు కళ్లు దానిపై పడ్డాయి. ఆ భూమిని చంద్రబాబు ప్రజల నుంచి లాక్కున్నారు. ఫ్లాట్లు కట్టిస్తామని డ్రామాలు ఆడుతున్నారు.
అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు ఇప్పించరట. తక్కువ రేటుకు చంద్రబాబు బినామీ, చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి ఆ భూములను కొంటున్నారు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో సాగునీరు ఇబ్బంది ఉంది. సాగర్‌ కుడికాలువ నుంచి నీరు వచ్చే అవకాశం ఉన్నా కుర్లపాడు, పసుమర్రు కాలువలను పొడిగించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. వైఎస్‌ఆర్‌ పాలన గురించి రైతులు గొప్పగా చెప్పారు. అప్పట్లో మేం పొగాకు వేసుకునేవాళ్లం. తగిన గిట్టుబాటు ధర వచ్చేది. హాయిగా జీవించేవాళ్లం. అందుకే కాలువల పొడిగింపు గురించి వైఎస్‌ఆర్‌ను అడగలేదని రైతులు చెబుతున్నారు.

English summary
Guntur: jagan criticized that Chilakaluripeta in number one position in the state in corruption. He spoke at the Chilakuluripeta public meeting on the 117th day of his pada yatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X