నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో చిన్నారిని మింగిన బోరుబావి..కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యం

|
Google Oneindia TeluguNews

విడమలూరు : పైప్‌లైన్ కోసం తవ్విన కందకం చిన్నారి ఊపిరి తీసింది. మరో చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. నెల్లూరు జిల్లా విడమలూరు కందకంలో పడి సుష్మిత విగతజీవిగా మారడంతో ఆ కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

12 అడుగుల లోతు ..
నెల్లూరు జిల్లా విడమలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో పై‌ప్ లైన్ కోసం 12 అడుగుల కందకం తవ్వారు. అయితే పైప్ లైన్ వేయకపోవడం .. అటుగా చిన్నారులు వెళతారనే జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. దీంతో అనుకున్నట్టుగానే మూడేళ్ల సుష్మిత, నాలుగేళ్ల గోపీరాజు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో కందకానికి సమాంతరంగా తవ్వి మట్టిని వెలికితీశారు.

child die in trench

గంటన్నర నరకయాతన ...
దాదాపు గంటన్నర పాటు చిన్నారులు కందకంలో ఉండిపోయారు. ఈ లోపు జేసీబీతో తవ్వించి .. వారిని బయటకు తీశారు. అయితే కందకంలో పడి చిన్నారి సుస్మిత తీవ్రంగా గాయపడింది. బయటకు తీసిన కాసేపటికే చనిపోయి .. కన్నవారికి కడుపుశోకాన్ని మిగిల్చింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరూ సురక్షితంగా వచ్చారనే సంతోషం కాసేపట్లో ఆవిరైంది. సుష్మిత మృతితో ఆమె పేరెంట్స్, బంధువులు బోరున విలపించారు.

English summary
A 12-foot trench has been dug for the pipeline at Odukuru Pedapalem, Vidalloor mandal of Nellore district. But there is no pipeline. As expected, three-year-old Sushmita and four-year-old Gopiraju have fallen. The villagers immediately alerted the authorities. With the help of the locals, the soil was dug parallel to the trench.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X