గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారి కడుపులో 4.5సెం.మీ సూది.. నిమిషాల్లో తొలగించిన వైద్యులు..

|
Google Oneindia TeluguNews

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ప్రతీ క్షణం వాళ్లను గమనిస్తూ ఉండాలి. లేదంటే చేతికి దొరికిన వస్తువును నోట్లో పెట్టేసుకోవడం.. స్టూల్స్,బల్లలు ఎక్కి కిందపడటం.. ఇలా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా గుంటూరులోని పొత్తూరువారితోటకు చెందిన ఓ చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో.. బట్టలు కుట్టే సూదిని మింగేసింది. గమనించిన తండ్రి అబేదుల్లా హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

ఆసుపత్రిలో చిన్నారికి మొదట ఎక్స్‌రే తీసిన వైద్యులు.. ఎండోస్కోపీ ద్వారా కేవలం 8 నిమిషాల్లోనే ఆ సూదిని చిన్నారి కడుపు నుంచి బయటకు తీశారు. సూది పొడవు 4సెం.మీ ఉందని తెలిపారు.

child swallowed a needle doctors removed through endoscopy

చిన్నారి సూదిని మింగినప్పటికీ.. ఆమె అదృష్టం కొద్ది శరీరంలో ఎక్కడా ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు. సూదిని బయటకు తీసి చిన్నారి ప్రాణాలు కాపాడిన వైద్యులను ఆసుపత్రి సూపరిండెంట్ అభినందించారు. చిన్నారులను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. తెలిసీ తెలియక ఏవేవో నోట్లో పెట్టుకుంటారని ఆయన పేర్కొన్నారు.

English summary
A 5years old patient had ingested two sewing needles about 4.5 cm long accidentally.Doctor removed needle through endoscopy,in Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X