అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో పెట్టుబడులకు చైనా ఆసక్తి, రాజధాని డిజైన్లపై లండన్‌లో చర్చ

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన టోంగ్‌జౌ కన్‌స్ట్రక్షన్‌ జనరల్‌ కాంట్రాక్టింగ్‌ గ్రూప్‌ ఆసక్తి కనబరిచింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన టోంగ్‌జౌ కన్‌స్ట్రక్షన్‌ జనరల్‌ కాంట్రాక్టింగ్‌ గ్రూప్‌ ఆసక్తి కనబరిచింది. గృహ నిర్మాణం, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించింది.

రాజధానిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అవకాశాలపై సీఆర్డీఏ ఆర్థిక అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. దీనిలో టోంగ్‌జౌ సంస్థ ఓవర్సీస్‌ సేల్స్‌ మేనేజర్‌ ఫాన్‌ బింగ్‌, వైస్‌ జనరల్‌ మేనేజర్‌ డింగ్‌ హాయ్‌ రోంగ్‌, చెన్నైకి చెందిన స్పార్టెక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ త్రిపురనేని కృష్ణప్రసాద్‌తదితరులు పాల్గొన్నారు.

Amaravati

రాజధాని పరిధిలో ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులు, అవకాశాల గురించి సీఆర్డీఏ ఆర్థికాభివృద్ధి డైరెక్టర్ నాగిరెడ్డి వివరించారు. వాటిలో ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులతోపాటు, ఉద్యోగులు సొంతంగా చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నారు. ఆయా కంపెనీలకు ఆసక్తి ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి సవివర ప్రతిపాదనలతో రావాలని కోరారు.

రాజధాని డిజైన్లపై చర్చ

ఏపీ మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ లండన్‌లో అమరావతి డిజైన్లపై చర్చించారు. లండన్‌లోని నార్మన్ పోస్టర్ కార్యాలయంలో ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాజధాని అమరావతి డిజైన్లపై చర్చించారు.

English summary
China company to invest in Andhra Pradesh new capital Amaravati. China Company delegates on Wednesday met CRDA officers in CRDA office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X