వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ నుంచి బెంగళూరు మెట్రోరైలు బోగీల సరఫరా: రూ.855 కోట్ల పెట్టుబడికి చైనా సంస్థ రెడీ:

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చైనాకు చెందిన అతి పెద్ద రైల్వే బోగీల తయారీ సంస్థ సీఆర్ఆర్సీ నాన్జింగ్ పుజెన్ కార్పొరేషన్ మన రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్)కు చెందిన దక్కించుకున్న ఆ సంస్థ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో ర్యాకుల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతోంది. బెంగళూరు మెట్రో రైలు రెండోదశ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టు అది.

ఈ కాంట్రాక్టు కింద సీఆర్ఆర్సీ కార్పొరేషన్ బెంగళూరు మెట్రో రైల్వే రెండోదశ ప్రాజెక్టు కోసం 216 బోగీలను తయారు చేయాల్సి ఉంటుంది. బెంగళూరుకు సమీపంలో ఉన్నందున ఈ తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి శ్రీసిటీ ఎంపిక చేసింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ (ఎల్ఓఏ)ని బెంగళూరు మెట్రో రైల్వే అధికారులు సీఆర్ఆర్సీ కార్పొరేషన్ ప్రతినిధులకు అందజేశారు.

Chinas CRRC bags coach rolling stock order for Bangalore Metro phase-2

ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీన బెంగళూరు మెట్రో రైల్వే రెండోదశ పనులు ఆరంభం కానున్నాయి. రెండోదశ కింద బీఎంఆర్సీఎల్ అధికారులు మొత్తం 36 రైళ్లను వేర్వేరు మార్గాల్లో నడిపించనున్నారు. ఒక్కో రైలుకు ఆరు ర్యాకులు ఉంటాయి. ఈ ర్యాకుల తయారీ కోసం బీఎంఆర్సీఎల్ అధికారులు గ్లోబల్ టెండర్లను పిలిచారు. సీఆర్ఆర్సీ కార్పొరేషన్ 8,549,498,321 రూపాయలతో లోయెస్ట్ బిడ్డింగ్‌తో ఎల్ 1గా నిలిచింది. దీనితో ఆ సంస్థకు ర్యాకుల తయారీని అప్పగించారు.

ఇందులో భాగంగా- డీటీజీ సిగ్నలింగ్ వ్యవస్థ గల 126 మెట్రో బోగీలు, సీబీటీసీ సిగ్నలింగ్ వ్యవస్థ గల 90 మెట్రో రైలు బోగీలను సీఆర్ఆర్సీ సంస్థ తయారు చేయాల్సి ఉంటుంది. ముంబై మెట్రో-64, గుర్‌గావ్ ర్యాపిడ్ మెట్రో-36, నవీ ముంబై మెట్రో-24, కోల్‌కత-112, నొయిడా మెట్రో-76, నాగ్‌పూర్-99 బోగీలను ఇప్పటికే ఈ సంస్థ తయారు చేసింది. దీనికోసం వేర్వేరు ప్రాంతాల్లో తయారీ యూనిట్లను నెలకొల్పింది. తాజాగా శ్రీసిటీలో తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతోంది.

English summary
China’s State-Owned CRRC Corporation Ltd. successfully awarded the bid to provide 216 new coaches from Bangalore Metro Rail Corporation Limited (BMRC). The contract won by CRRC Nanjing Puzhen Co Ltd. for the stainless steel body 216-cars for 73.95 km long Bangalore Phase-2 project in India, which set a record for CRRC to get the highest number of vehicles and complete orders in the Indian metro rail market. Out of the total 216 Coach, 126 coach (21 train x 6 coaches) will be utilized for the namma metro phase I extension line, and the remaining 90 (15 Train x 6 coaches) will be used for new lines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X