వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియేటరా? చినజీయర్‌తో భేటీ వెనుక!?: మీడియాతో మాట్లాడని జగన్

చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన వైసిపి అధినేత వైయస్ జగన్ ఆయనను కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడలేదు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ys Jagan Seeks Blessings From Godmen Chinna Jeeyar Swami చినజీయర్‌ స్వామి తో జగన్ | Oneindia Telugu

హైదరాబాద్: చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన వైసిపి అధినేత వైయస్ జగన్ ఆయనను కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడలేదు.

ఇదీ సమస్య!: చినజీయర్‌ను కలిసిన జగన్, అరగంట భేటీ, 'బాబు రూ.15 లక్షల కోట్లు వెనుకేశారు'ఇదీ సమస్య!: చినజీయర్‌ను కలిసిన జగన్, అరగంట భేటీ, 'బాబు రూ.15 లక్షల కోట్లు వెనుకేశారు'

ఆశ్రమానికి ఆయన ఎందుకు వచ్చారు, ఆయనతో ఏం మాట్లాడారన్నది వైసిపి వర్గాలు వెల్లడించలేదు. ఆశ్రమం వద్ద కూడా జగన్ మీడియాతో ఏమీ మాట్లాడలేదు. అయితే ఆశీర్వాదం కోసం మాత్రమేనని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

 జీయర్ పాదాలకు మొక్కిన జగన్

జీయర్ పాదాలకు మొక్కిన జగన్

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం వైసిపి ఇప్పటికే యాగం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి జగన్‌.. చినజీయర్ ఆశీస్సులు పొందినట్లుగా కూడా చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు పాదాభివందనం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు జీయర్‌కూ కాళ్లు మొక్కారు.

 కొంతకాలంగా బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు

కొంతకాలంగా బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు

జగన్ బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. మరోవైపు, ఈ నెల 27వ తేదీ నుంచి జగన్ తలపెట్టిన పాదయాత్ర నవంబర్ 2కు వాయిదా పడింది. దీనిపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. చినజీయర్‌ ఆశ్రమానికి జగన్‌ ఆశీర్వాదం కోసమే వెళ్లారని, ఎలాంటి ప్రత్యేకత, రాజకీయ ప్రాధాన్యం లేదని వైసిపి చెబుతోంది. ఇటీవల జగన్ తీరు బిజెపికి దగ్గరయ్యేలా కనిపిస్తోందని అంటున్నారు.

 జగన్‌కు జీయర్ స్వాగతం

జగన్‌కు జీయర్ స్వాగతం

మంగళవారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జగన్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా సమీపంలోనే ఉన్న చినజీయర్‌ ఆశ్రమానికి వెళ్లారు. జిమ్స్ ఆస్పత్రి వద్ద చినజీయర్‌ జగన్‌కు స్వయంగా స్వాగతం పలికారు.

 చినజీయర్ పట్ల జగన్..

చినజీయర్ పట్ల జగన్..

ఆసుపత్రిలోని తన కార్యాలయానికి లిఫ్టులో తీసుకెళ్లారు. ఈ సమయంలో జగన్‌ పూర్తి వినయపూర్వకంగా వ్యవహరించారు. చేతులు కిందికి వదలకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా ఆయనతో నడిచారు. జీయర్‌ స్వామితో ఆయన కార్యాలయంలో కొద్దిసేపు చర్చించారు. జీయర్‌ సంస్థ నిర్వహిస్తున్న ఆస్పత్రిని జగన్‌ పరిశీలించారు.

 చినజీయర్‌కు ప్రశంసలు

చినజీయర్‌కు ప్రశంసలు

పేదలకు సేవలను అందిస్తున్నారంటూ చినజీయర్ స్వామిని జగన్ ప్రశంసించారు. అనంతరం జగన్‌కు చినజీయర్‌ కింది దాకా వచ్చి వీడ్కోలు పలికారు. అలా వెళ్లే సమయంలో జగన్‌ తొలుత చేతులతో నమస్కరించి, ఆపై రెండు పాదాలను తాకి నమస్కరించి జీయర్‌ ఆశీస్సులను పొందారు.

 బిజెపికి, జగన్‌కు మధ్య మీడియేటరా?

బిజెపికి, జగన్‌కు మధ్య మీడియేటరా?

కాగా, బిజెపి - జగన్‌కు మధ్య చినజీయర్ స్వామి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. గత వారం బిజెపి, హిందుత్వ సంస్థల నేతలను కూడా జగన్ కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు, హిందువులకు మరింత దగ్గరయ్యేందుకు జగన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.

English summary
YSR Congress Leaders say it is a routine visit to seek the blessings of Swamy. There are also rumours that Jagan met Narasapuram BJP MP Gokaraju Ranga Raju at his residence last week to negotiate with RSS over the alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X