వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది ఒక హెచ్చరిక అందుకే ఈ నెల 17 నుండి .. రామతీర్థంలో చినజీయర్ స్వామి ఆసక్తికర ప్రకటన

|
Google Oneindia TeluguNews

రామతీర్థం ఘటన నేపథ్యంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల లోని రామతీర్థంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి పర్యటించారు. రామతీర్థం లోని కోదండరామ స్వామి ఆలయాన్ని, విగ్రహాన్ని పడవేసిన రామ కొలనును పరిశీలించిన చిన్న జీయర్ స్వామి రామతీర్థం పర్యటన నేపథ్యంలో సంచలన ప్రకటన చేశారు.

రామతీర్ధంలో పర్యటించిన చినజీయర్ స్వామీజీ

రామతీర్ధంలో పర్యటించిన చినజీయర్ స్వామీజీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామతీర్థంలో రాములవారి విగ్రహ ధ్వంసం ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపివేసింది. ఈ ఘటన నేపథ్యంలో స్వామీజీ లు సైతం అప్రమత్తమై హిందూ ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక రామతీర్ధం ఘటన నేపథ్యంలో రామతీర్థం పర్యటన చేసిన చిన్న జీయర్ స్వామి అక్కడ జరిగిన విగ్రహ ధ్వంసం ఘటనను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి తెలియకుండా రహస్యంగా చిన్న జీయర్ స్వామి పర్యటన కొనసాగినా ఆయన చేసిన ప్రకటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఈనెల 17వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల సందర్శన

ఈనెల 17వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల సందర్శన


రామతీర్థంలో పర్యటించిన చిన్న జీయర్ స్వామి రామతీర్థం ఆలయం లో ఎలాంటి వసతులు లేవని, ఆ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు రామతీర్థం ఆలయం నిర్మాణానికి ఆగమశాస్త్ర సూచనలు చేసినా ఆయన రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాల దర్శన యాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలను ఆయన సందర్శించనున్నట్లు, రాష్ట్రంలోని ఆలయాలలో జరిగిన వివిధ ఘటనల తీరును, లోపాలను తెలుసుకోవడం కోసం పర్యటనను చేస్తున్నట్లు చిన్న జీయర్ స్వామి వివరించారు.

ప్రభుత్వానికి ఆలయాల పరిరక్షణ విషయంలో సూచనలు చెయ్యనున్న చినజీయర్ స్వామి

ప్రభుత్వానికి ఆలయాల పరిరక్షణ విషయంలో సూచనలు చెయ్యనున్న చినజీయర్ స్వామి

ఆలయాలలో అవసరమైన చర్యలను చేపట్టడానికి సూచనలు కూడా చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
రామతీర్థం ఆలయంలోని ఘటనను హెచ్చరికగా తీసుకుని రాష్ట్రంలోని మారుమూల ఆలయాలను గుర్తించి ఏడాదిలోగా తగిన సదుపాయాలను కల్పించాలని ,రక్షణ చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖకు సూచనలు చేశారు చిన్న జీయర్ స్వామి. రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్న స్వామీజీ భక్తులు ఆలయాల్లోకి వచ్చేలా తీర్చిదిద్దాలని సూచించారు.

 చినజీయర్ స్వామి ఆలయాల పర్యటన నేపధ్యంలో ఆసక్తి

చినజీయర్ స్వామి ఆలయాల పర్యటన నేపధ్యంలో ఆసక్తి

ఈ విషయంలో ప్రభుత్వ చర్యలతో పాటు, భక్తిభావంతో ఆలయాలకు ప్రజలు వచ్చేలా చూడాలని చిన్న జీయర్ స్వామి సూచనలు చేశారు. ఈనెల 17వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా చిన్న జీయర్ స్వామి ఆలయాలను సందర్శించనున్న నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఏపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

English summary
Chinna jeeyar Swamyji, who inspected the Ramatirtham temple, made a sensational statement. Apart from politics, he will visit temples in the state of Andhra Pradesh. He said he would visit temples across the state from the 17th of this month and visit various temples in the state to find out the nature of the incidents and the flaws. He said he would make suggestions to the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X