వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్! నాపై పోటీ చేసి గెలువు, ఊరేగిస్తా, బజారు నాయకుడిలా: చింతమనేని సవాల్

|
Google Oneindia TeluguNews

దెందులూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి గెలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని, ఎలాంటి కమిటీని అయినా వేసుకోవాలని సూచించారు. అర్థం లేని ఆరోపణలు సరికాదన్నారు. పవన్ సినిమాల్లో వలె రాజకీయాల్లో నటించాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Recommended Video

పవన్! మాట్లాడితే తట్టుకోలేవు..చింతమనేని వార్నింగ్ !

ప్రత్యేక హోదా విషయంలో గతంలో వలే కేంద్రాన్ని నిలదీయడం లేదని, రాఫెల్ డీల్ గురించి మాట్లాడటం లేదన్నారు. ఆయన బీజేపీ, వైసీపీ వైసీపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారన్నారు. 1996లోనే చంద్రబాబు హయాంలో తనపై రౌడీషీట్ ఓపెన్ చేశారని, దాని గురించి ప్రజలకు తెలుసునని, పవన్ వచ్చి చెప్పాలా అన్నారు. అలాంటి వాటిని ఎత్తివేయాలని తాను ఎప్పుడూ అడగలేదన్నారు.

పవన్! మాట్లాడితే తట్టుకోలేవు, రెండోవైపు చూడకు: తమ్ముడూ అంటూనే చింతమనేని వార్నింగ్పవన్! మాట్లాడితే తట్టుకోలేవు, రెండోవైపు చూడకు: తమ్ముడూ అంటూనే చింతమనేని వార్నింగ్

నాపై పోటీ చేసి గెలువు

నాపై పోటీ చేసి గెలువు

చింతమనేనికి తన కావాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకొని పవన్ దెందులూరు నుంచి పోటీ చేయవచ్చునని చింతమనేని అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకొని దెందులూరు నుంచి పోటీ చేస్తే గెలిపిస్తా అన్నారు. పవన్‌ను భుజానికెత్తుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తానని చెప్పారు. పవన్ సామాజిక వర్గం తనతోనే ఉందని చెప్పారు. లేదంటే పవన్ నాపై పోటీ చేస్తే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. దెందులూరులో తనపై పోటీ చేయాలన్నారు. నా నియోజకవర్గంలో నేనే హీరో అన్నారు. పవన్ కేవలం బొరుసునే చూస్తున్నాడని, బొమ్మను కూడా చూస్తే నేను ఏమిటో తెలుస్తుందన్నాడు. తాను ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టానని చెబుతున్నాడని, కానీ తాను ఆ వ్యక్తినే కాదన్నారు. పవన్ పిట్టల దొరలా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయాలంటే సినిమా మాదిరి నటించడం కాదన్నారు.

నాపై పవన్ గెలిస్తే అభినందన సభకు వస్తా

నాపై పవన్ గెలిస్తే అభినందన సభకు వస్తా

తాను ఎవరికీ భయపడేది లేదని చింతమనేని చెప్పారు. పితాని సత్యనారాయణకు టిక్కెట్ ఇస్తే తాను తిట్టానని చెప్పారని, కానీ ఆయనకు మంత్రి పదవి ఇస్తే చంద్రబాబు వద్దకు వెళ్లి తాను సీనియర్ను అని ఆవేదన వ్యక్తం చేశానని, అలా చేసే హక్కు తనకు ఉందని, కానీ తాను బహిరంగంగా మాట్లాడలేదన్నారు. శిశుపాలుడు ఎవరు, శ్రీకృష్ణుడు ఎవరో తెలియాలంటే మీరు నాపై పోటీ చేయాలని సవాల్ చేశారు. చావోరేవో.. దెందులూరులో పోటీ చేయ్ అన్నారు. నాపై గెలిస్తే నీ అభినందన సభకు వస్తానని చెప్పారు. నేను గెలిస్తే... ఓ పెద్దవాడిని ఓడించానని సంతోషపడతా అన్నారు. తనకు షేక్ హ్యాండ్ ఇస్తే చాలన్నారు.

హిట్లర్‌తో పోలుస్తావా?

హిట్లర్‌తో పోలుస్తావా?


పవన్ మాట్లాడితే నేతిబీరకాయలా ఉందని చింతమనేని అన్నారు. నన్ను హిట్లర్‌తో పోల్చావంటే నీవు ఎలా మాట్లాడున్నావో అర్థమవుతోందన్నారు. కొంతకాలం నీకు పని చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని, కానీ నీ పార్టీలోకి మాత్రం రాలేనని చెప్పారు. నటుడిగా పవన్‌ను తాను అభిమానిస్తానని అన్నారు. మీరు నటుడు, అలాగే మీ అభిమానులు బాధపడవద్దని, వారిని హర్ట్ చేయవద్దని అందుకే మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం లేదన్నారు. గబ్బర్ సింగ్‌లా సినిమాల్లో యాక్ట్ చేసినట్లు కాదని, రాజకీయాల్లోను అలాగే నడుచుకోవాలని హితవు పలికారు. చీప్ విప్, విప్‌కు కూడా తేడా తెలియదన్నారు. పాచిపోయిన లడ్డూలు అని మీరే చెప్పిన హోదాను ఎందుకు మరిచిపోయారని ప్రశ్నించారు.

బజారు నాయకుడిలా దిగజారిపోయారు

బజారు నాయకుడిలా దిగజారిపోయారు

బజార్ నాయకుడిలా ఎందుకు పవన్ దిగజారిపోయారని చింతమనేని ప్రశ్నించారు. నువ్వేదో.. 18 ఏళ్ల వ్యక్తిని నాపై పోటీకి పెడతానని చెబుతున్నావని, కానీ అతనికి ఓటు హక్కు వస్తుందని, పోటీ హక్కు లేదని కూడా నీకు తెలియదా అన్నారు. నేను రాజ్యాంగ వ్యతిరేక శక్తిని అయితే రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తానని చెప్పారు. అసెంబ్లీ రౌడీ శివాజీ.. ఎలా గెలిచాడో.. మీపై నేను అలాగే గెలుస్తానని చెప్పారు.

English summary
Don't try to see another side of coin, Denduluru MLA Chintamaneni Prabhakar warning to Jana Sena chief Pawan Kalyan. Chintamaneni challenges Pawan Kalyan to contest against him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X