• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నా ఎన్ కౌంటర్ కు కుట్ర .. సజ్జల ఆదేశాలతోనే : చింతమనేని సంచలన ఆరోపణ, వారిపై ఫిర్యాదు

|

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడని టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసి, స్టేషన్ బెయిల్ పై విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్ ఏపీ పోలీసులపై, వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను తిరిగి వస్తానని అనుకోలేదని, తనను ఎన్ కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశారని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే తన హత్యకు ప్రణాళికలు రచించారని ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు.

YS Jagan In Idupulapaya: ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్ , ఘన స్వాగతం పలికిన అధికారులుYS Jagan In Idupulapaya: ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్ , ఘన స్వాగతం పలికిన అధికారులు

 ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చింతమనేని

ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చింతమనేని

అంతేకాదు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఆయన తనపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని కోరుతూ చింతమనేని ప్రభాకర్ తన ఫిర్యాదును అందించారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన ఫిర్యాదులో ఆయన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ, విశాఖ పట్నం జిల్లా ఎస్పీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీలు తన హత్యకు కుట్ర పన్నారని చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు.

విశాఖ ఏజెన్సీలో తమను అక్రమంగా అరెస్ట్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించారు

విశాఖ ఏజెన్సీలో తమను అక్రమంగా అరెస్ట్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించారు

ఆగస్టు 28వ తేదీన తన స్నేహితులతో కలిసి విశాఖ రూరల్ జిల్లా జీకే వీధి మండలం దారకొండ దారాలమ్మ గుడికి పది వాహనాలలో వెళ్ళామని, 29వ తారీకు ఉదయాన్నే అమ్మవారి దర్శనం చేసుకొని ఇళ్లకు బయలుదేరి వస్తుండగా సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో నర్సీపట్నం అవుట్ పోస్ట్ వద్ద పోలీసులు తమ వాహనాన్ని ఆపి తమ వద్ద ఉన్న మొబైల్స్ ను తీసుకొని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడ 50 మంది పోలీసులు తమను చుట్టుముట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 30వ తేదీ తెల్లవారుజామున ఐదున్నర గంటలకు పోలీసు వాహనంలో చింతపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారని ,అదే రోజు అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాలకు అడిషనల్ ఎస్పీ ఒకరు వచ్చి తమ పట్ల దురుసుగా ప్రవర్తించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు చింతమనేని ప్రభాకర్.

తనను ఒంటరిగా కార్ లో తీసుకెళ్ళారు.. ఎన్ కౌంటర్ స్కెచ్ వేశారు

తనను ఒంటరిగా కార్ లో తీసుకెళ్ళారు.. ఎన్ కౌంటర్ స్కెచ్ వేశారు

పోలీస్ స్టేషన్ చుట్టూ వంద మంది పోలీసులు కాపలా పెట్టి తమ గురించి చర్చించారని, వారి సంభాషణ ప్రకారం తనను ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశారని అర్థమైంది అని పేర్కొన్నారు చింతమనేని ప్రభాకర్. ఇక మరుసటి రోజు తెల్లవారుజామున తనను కార్ ఎక్కించి ఒంటరిగా తీసుకువెళ్లారని చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు .తనతో పాటు కారులో సీఐ నాగేశ్వరరావు, ఎస్సై, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు తనను చంపేస్తారని అనుకున్నానని, అడవిలో తనను కాల్చేస్తారని అనుకున్నానని తెలిపారు. కార్ లో సీఐ నాగేశ్వరరావు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ అనుకున్న ప్రకారం వేరుగానే తీసుకువస్తున్నాము , మన టార్గెట్ రీచ్ అవ్వబోతున్నామని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో ఎన్ కౌంటర్ ప్లాన్

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో ఎన్ కౌంటర్ ప్లాన్

అయితే టిడిపి నాయకుల ఆందోళన, చింతమనేని అరెస్ట్ పై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో తనను ఎన్కౌంటర్ చేయకుండా భీమడోలు పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళి 41 ఏ నోటీసు ఇచ్చారని చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. ఆగస్టు 28 వ తేదీ నుండి 30 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు తనను అనేకరకాలుగా మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని, అయన ప్రాణాలకు పోలీసులతో హాని పొంచి ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్న చింతమనేని ప్రభాకర్, తనను ఎన్కౌంటర్ చేయాలని కుట్ర చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో తనను చంపేందుకు ప్రయత్నం జరిగిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కార్యకర్త పెళ్ళికి వెళ్ళారన్న టీడీపీ .. అమ్మవారి దర్శనానికి వెళ్లానన్న చింతమనేని

కార్యకర్త పెళ్ళికి వెళ్ళారన్న టీడీపీ .. అమ్మవారి దర్శనానికి వెళ్లానన్న చింతమనేని

ఇదిలా ఉంటే దారకొండ దారాలమ్మ గుడికి దర్శనానికి వెళ్లానని చింతమనేని ప్రభాకర్ తాను పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక టిడిపి నాయకులు చింతమనేని ప్రభాకర్ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి కార్యకర్త పెళ్లికి హాజరు కావడానికి వెళ్లారని చెప్పడం గమనార్హం. విశాఖ ఏజెన్సీకి చింతమనేని ప్రభాకర్ ఎందుకు వెళ్లారు అంటే టిడిపి నేతలు చెబుతున్న కారణాలు ఎలా ఉన్నాయో, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఎందుకు అరెస్టు చేశారు అంటే పోలీసులు చెబుతున్న కారణాలు కూడా అలాగే ఉన్నాయి. గంజాయి ప్రభావిత ప్రాంతాలలో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో చింతమనేని ప్రభాకర్ అనుమానాస్పదంగా సంచరిస్తున్న కారణంగానే ఆయనను అరెస్టు చేశామని పోలీసులు చెప్పడం గమనార్హం.

 బెయిల్ పై రాగానే తనకు పోలీసులతో ప్రమాదం ఉందన్న చింతమనేని

బెయిల్ పై రాగానే తనకు పోలీసులతో ప్రమాదం ఉందన్న చింతమనేని

స్టేషన్ బెయిల్ పై విడుదలైన తర్వాత తన ఇంటి వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించిన చింతమనేని ప్రభాకర్ ఆ సమయంలోనే పోలీసులతో తనకు ప్రమాదం ఉందని చెప్పారు. న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులే అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు అంటూ చింతమనేని నిప్పులు చెరిగారు. తనపై కావాలని అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తనకు పోలీసులతో ప్రమాదం పొంచి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తన అరెస్ట్ వెనుక కుట్ర ఉందన్న చింతమనేని ఫిర్యాదు

తన అరెస్ట్ వెనుక కుట్ర ఉందన్న చింతమనేని ఫిర్యాదు


దెందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటే మూడు మండలాల ఎస్సైలు తన మీద కేసులు నమోదు చేశారని పేర్కొన్న చింతమనేని ప్రభాకర్, పెదవేగి మండలం ఎస్సై కేసు ఎప్పుడు పెడతారో ఎదురుచూస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చింతమనేని, జగన్ కేనా కుటుంబం ఉంది.. తనకు లేదా ..అని ప్రశ్నించారు. తనను అరెస్టు చేయడం వెనుక కుట్ర కోణం దాగుందని చింతమనేని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు తనను ఎన్ కౌంటర్ చెయ్యాలని చూశారని పోలీసులపై చింతమనేని ఫిర్యాదు చేశారు .

English summary
It is learned that TDP leader and former Denduluru MLA Chintamaneni Prabhakar was arrested and released on station bail on suspicion of roaming in the Visakhapatnam agency area. Prabhakar has been making harsh remarks against the AP police and YCP leaders over the order. He has made sensational allegations that he did not expect to return, planned to encounter him and planned his assassination on the orders of government adviser Sajjala Ramakrishnareddy. Complaints have also been made to this extent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X