వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌తిప‌క్షాల దుష్ప్ర‌చారం :నా వ‌ల‌న పార్టీకి న‌ష్టం జ‌రిగితే వెళ్లిపోతా :పోలీసుల‌కు ఫిర్యాదు..

|
Google Oneindia TeluguNews

ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ దళితుల‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేసారంటూ ఓ వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీని పై చింత‌మ‌నేని సీరియ‌స్ గా స్పందించారు. తాను ఏ ఒక్క దళిత వ్యక్తీ బాధపడేలా తాను మాట్లాడలేదని చెప్పారు. ప్ర‌చారం చేస్తున్న వారి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

చింత‌మ‌నేని వీడియా హ‌ల్‌చ‌ల్..

ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌త నెల‌లో జ‌రిగిన జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో మాట్లాడు తూ వైసిపి అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను అడ్డుకోవాలంటే అడ్డుకుంటాన‌ని మీరంతా స‌హ‌క‌రిస్తారా లేద అని ప్ర‌శ్నిస్తూ నే..మీరంతా ద‌ళితులు మీకెందుకు రాజ‌కీయాలు ....అంటూ కొన్ని అనుచిత ప‌దాల‌ను ప్ర‌యోగించారు. అదే స‌మ యం లో ద‌ళితుల అభివృద్దికి తాను చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది. చింత‌మ‌నేని ద‌ళితుల‌ను అవ‌మానించేలా మాట్లాడారంటూ విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. చింత‌మ‌నే ని పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే..

రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే..

ఈ వీడియో ఆధారంగా త‌న పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు చింత‌మ‌నేని స్పందించారు. దెందులూరులో రాజకీయంగా ఎదు ర్కొనలేకే ప్రతిపక్షాలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. గతంలో తాను మాట్లాడిన అంశాలను వక్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. విపక్ష నేతల తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టా రు. అనంతరం ఏలూరులో జిల్లా ఎస్పీకి ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం చింతమనేని మీడియాతో మా ట్లాడుతూ ఆ వీడియోలో తన మాటలను వక్రీకరించారని.. ఏ ఒక్క దళిత వ్యక్తీ బాధపడేలా తాను మాట్లాడలేదని చెప్పా రు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు ఆయన తెలిపారు.

పార్టీకి నష్ట‌మైతే వెళ్లిపోతా..

పార్టీకి నష్ట‌మైతే వెళ్లిపోతా..

త‌న కార‌ణంగా టిడిపికి న‌ష్టం జ‌రిగితే తాను పార్టీలో ఉండ‌న‌ని..పార్టీ నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోతాన‌ని చింత‌మ‌నేని స్ప‌ష్టం చేసారు. త‌న మీద కుట్ర పూరితంగా ఇటువంటి ప్ర‌చారం చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. ఓ మీడియా సంస్థ వ‌ద్ద ఆయ‌న ధ‌ర్నా నిర్వ‌హించారు. సోష‌ల్ మీడియాలోనూ త‌న పై దుష్ఫ్ర‌చారం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. త‌న పై చేస్తున్న ప్ర‌చారం పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. అయితే, ఈ వ్య‌వ‌హారం పై టిడిపి అధినాయ‌క‌త్వం నిశితంగా దృష్టి సారించింది. చింత‌మ‌నేని ఏం మాట్లాడారు..ఏం ప్ర‌చారం జ‌రుగుతుంద‌నే దాని పై ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపిలో హాట్ టాపిక్ గా మారింది.

English summary
AP govt whip Chintamaneni Prabhakar in another controversy. But, chintamaneni protest against opposition and one media organisation in West godavari dist. He complaint police on them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X