హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మా చిరంజీవి అంటే మీకే నష్టం, కాపుల కడుపు నిండదు' 'బాలకృష్ణకు ఓకే, లెజెండ్‌పైనే '

ఏపీ ప్రకటించిన నంది అవార్డులపై వివాదం కొనసాగుతోంది. అవార్డుల్లో రుద్రమదేవి, రేసుగుర్రం వంటి సినిమాలకు తీవ్ర అన్యాయం జరిగిందని చాలామంది మండిపడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Nandi Awards Controversy : మా చిరంజీవి అంటే మీకే నష్టం, కాపుల కడుపు నిండదు

హైదరాబాద్/అమరావతి: ఏపీ ప్రకటించిన నంది అవార్డులపై వివాదం కొనసాగుతోంది. అవార్డుల్లో రుద్రమదేవి, రేసుగుర్రం వంటి సినిమాలకు తీవ్ర అన్యాయం జరిగిందని చాలామంది మండిపడుతున్నారు. మరోవైపు అవార్డుల్లో ఎలాంటి అన్యాయం జరగలేదని మరొకరు అంటున్నారు.

టైం కాదు, మీ ప్రాబ్లం: నంది వివాదంపై బాలకృష్ణ, బ్రాహ్మణి, జగపతి బాబులు ఇలాటైం కాదు, మీ ప్రాబ్లం: నంది వివాదంపై బాలకృష్ణ, బ్రాహ్మణి, జగపతి బాబులు ఇలా

 అలా అనడంతో

అలా అనడంతో

ఈ నేపథ్యంలో అవార్డుల వివాదంపై ఆంధ్రజ్యోతి ఓపెన్ డిబెట్ నిర్వహిస్తోంది. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారి వారి అభిప్రాయాలను, వాదాలను వినిపించారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వారించారు.

మా చిరంజీవికి నష్టమని బన్నీ వాసు

మా చిరంజీవికి నష్టమని బన్నీ వాసు

బన్నీ వాసు నంది అవార్డుల ప్రకటన లోపభూయిష్టంగా ఉందని మొదటి నుంచి చెబుతున్నారు. డిబెట్‌లో ఆయన మాట్లాడుతూ.. మా చిరంజీవి, మా మెగా ఫ్యామిలికీ 2002 నుంచి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు.

 చిరంజీవికే నష్టమని ఆర్కే

చిరంజీవికే నష్టమని ఆర్కే

దీంతో రాధాకృష్ణ మధ్యలో జోక్యం చేసుకున్నారు. అలా అనడం సరికాదని బన్నీ వాసుకు చెప్పారు. మా చిరంజీవి అని మాట్లాడటం సరికాదని, ఇలా మాట్లాడితే చిరంజీవికే ఎక్కువ నష్టమని, చిరంజీవి అందరివాడు అని వ్యాఖ్యానించారు.

 కాపులకు, కమ్మలకు కడుపు నిండదు

కాపులకు, కమ్మలకు కడుపు నిండదు

చిరంజీవి ముఖ్యమంత్రి అయితే కాపులకు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కమ్మలకు కడుపు నిండదు అని రాధాకృష్ణ హితవు పలికారు. ఇలా వేరు చేసే మాటలు సరికాదని అభిప్రాయపడ్డారు.

 బాలకృష్ణకు ఓకే, లెజెండ్‌పైనే ప్రశ్న

బాలకృష్ణకు ఓకే, లెజెండ్‌పైనే ప్రశ్న

కాగా, లెజెండ్ సినిమాకు గాను బాలకృష్ణకు, దర్శకుడికి అవార్డులు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ సినిమాకు బెస్ట్ ఫిలిం అవార్డు ఇవ్వడం సరికాదని డైరెక్టర్ శంకర్ అన్నారు. అందులో హింస ఎక్కువగా ఉందని చెప్పారు. చాలామందికి అదొక్కటే ప్రశ్నగా మిగిలిందని అబిప్రాయపడ్డారు.

 కులానికి అంటకట్టడం సరికాదు

కులానికి అంటకట్టడం సరికాదు

కాంగ్రెస్ పార్టీ హయాంలో అవార్డులు ఇవ్వనప్పుడు ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదని నిర్మాత అశ్వినీదత్ అన్నారు. వివాదం బాధాకరమని, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. అవార్డుల ఎంపికను ఓ కులానికి ఆపాదించవద్దన్నారు. అవార్డుల కమిటీలో బాధ్యతాయుతమైన వ్యక్తులు ఉండాలన్నారు.

English summary
Mega Star and Congress Party leader Chiranjeevi belongs to all, says Andhrajyothy MD Radhakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X