వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న చిరంజీవి .. ఎవరి కోసమో తెలుసా

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఎన్నికలకు దూరంగా ఉంటాడని అందరూ భావించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న ఆయన, ఏపీలో సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ బరిలో ఉండటంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు అందరూ చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరుతారని భావిస్తే, చిరంజీవి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న చిరంజీవి పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో ప్రచార బరిలోకి దిగుతున్నారు.

నాన్న కోసం నిహారిక ..నాన్నకు ఓటెయ్యండి , బాబాయి పార్టీని గెలిపించండని విజ్ఞప్తినాన్న కోసం నిహారిక ..నాన్నకు ఓటెయ్యండి , బాబాయి పార్టీని గెలిపించండని విజ్ఞప్తి

తెలంగాణలో చిరు ప్రచారం ... చేవెళ్ళ నియోజకవర్గ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం

తెలంగాణలో చిరు ప్రచారం ... చేవెళ్ళ నియోజకవర్గ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం

ఇంతకీ కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచార ఎవరికోసమో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. చిరంజీవి ఎన్నికల ప్రచారం తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కోసం మాత్రం కాదు. ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున కూడా కాదు. మరి ఇంతకీ ఎవరి కోసం చిరంజీవి ప్రచారం చేయబోతున్నాడు అంటే తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపును ప్రచారాన్ని నిర్వహించాలని చిరంజీవి నిర్ణయించారు.

చిరంజీవి ప్రచారంపై తాండూరు ఎమ్మెల్యే ప్రకటన

చిరంజీవి ప్రచారంపై తాండూరు ఎమ్మెల్యే ప్రకటన

ఈ విషయాన్ని తాండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి వికారాబాద్‌ రానున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి తెలిపారు. వీరిరువురూ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తరఫున ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు .

 ఏపీలో ప్రచారానికి దూరంగా ఉన్న చిరంజీవి

ఏపీలో ప్రచారానికి దూరంగా ఉన్న చిరంజీవి


ఒక పక్క ఏపీలో హోరాహోరీ పోరు జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నేతగా ఎన్నికల ప్రచారంలో పాల్గోవటం లేదు చిరంజీవి. మొదట కాంగ్రెస్ చిరంజీవితో ప్రచారం నిర్వహించాలని భావించినా తరువాత చిరు ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించారు . ఇక ఈ నేపధ్యంలోనే చిరంజీవి అటు జనసేనకు గానీ.. ఇటు కాంగ్రెస్‌కు గానీ మద్దతు ఇవ్వదలుచుకోలేదని ఏపీ రాజకీయాలకు దూరంగా ఉండనున్నారని టాక్ వినిపించింది .

తెలంగాణాలో ప్రచారం జనసేనకు , ఏపీ కాంగ్రెస్ నాయకులకు షాకింగ్

తెలంగాణాలో ప్రచారం జనసేనకు , ఏపీ కాంగ్రెస్ నాయకులకు షాకింగ్

చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపించింది . ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసినా వేరే పార్టీ నాయకులు బాధపడతారని.. అందుకే ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అయితే.. ప్రచారంలో పాల్గొనాలని రెండు పార్టీల నుంచి చిరుకు ఒత్తిడి వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రచారం సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపించింది. కానీ అనూహ్యంగా ఆయన తెలంగాణలో ప్రచారం చెయ్యనుండటం ఊహించని పరిణామం . జనసేనకు , ఏపీ కాంగ్రెస్ నాయకులకు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు .

 కొండా కోసం ప్రచారం అందుకేనట... తెలుగు రాష్ట్రాల్లో చిరు ప్రచారంపై ఆసక్తి

కొండా కోసం ప్రచారం అందుకేనట... తెలుగు రాష్ట్రాల్లో చిరు ప్రచారంపై ఆసక్తి

ఇక చిరంజీవి ఈ నిర్ణయం తీసుకోటానికి కారణం కొండా విశ్వేశ్వర్ రెడ్డి చిరంజీవి కోడలు ఉపాసనకు స్వయానా చిన్నాన్న కావటం తో ఆయన చిరంజీవిని కలిసి తన కోసం ఎన్నికల ప్రచారానికి రావాలని కోరినట్టు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రకటించిన విషయంలో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ చిరంజీవి విశ్వేశ్వర్ రెడ్డి తరపున ప్రచారం చేయడం మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర ఆంశమే.

English summary
Former Union Minister and Megastar Chiranjeevi will campaign for election campaign.Telangana electorate of the Chevella constituency Congress Konda Visveswarar Reddy decided to hold the campaign. This was announced by Congress MLA Pilot Rohitreddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X